Begin typing your search above and press return to search.
ఈ ఖర్చు ఎవరి ఖాతాలో మోడీ జీ!!
By: Tupaki Desk | 29 May 2023 1:05 PM''ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు.. దేశాన్ని అప్పుల పాలు చేయొద్దు'' అంటూ.. రెండు రోజుల కిందట రాష్ట్రాలకు సూక్తి ముక్తావళి వినిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నెటిజన్ల నుంచి సూటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో చారిత్రక ధర్మదండంతోపాటు తమిళనాడుకు చెందిన 19 మంది మఠాలకు చెందిన మఠాధిపతులు ఈ వేడుకలో అందరినీ ఆకర్షించారు.
ఈ జాబితాలో సుమారు 90 మంది వచ్చినట్టు తెలుస్తోంది. మఠాధిపతులు.. వారికి ఉత్తరాధికారులుగా ఉన్న వారు మొత్తంగా మఠానికి నలుగురుచొప్పున వేసుకున్నా 80 మందికిపైగానే ఉన్నారు. మరి వీరిని ఏదో రైల్లోనో.. బస్సులోనో తీసుకురాలేదు. ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి వారికి ఢిల్లీలోని మూడు రోజుల పాటు వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు.
మఠాధిపతులకు సహాయం చేయడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను కేటాయించారు. తమిళ భాష మాట్లాడే అధికారిని నియమించారు.19 మంది మఠాధిపతుల్లో ఆరుగురు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాజదండాన్ని బహుకరించారు. ధర్మపురం, మదురై, తిరువావడ్తురై, కుండ్రకుడి, పేరూర్, వేలకురిచ్చి మఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
''సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీ మమ్మల్ని పిలిచి గౌరవించడం మా మఠాధిపతులను ఉత్సాహపర్చింది'' అని ధర్మపురం మఠానికి సంబంధించిన సీనియర్ న్యాయవాది ఎం కార్తికేయ అన్నారు. ''1947వ సంవత్సరంలో ప్రధానమంత్రి నెహ్రూకి సెంగోల్‌ను అందించింది కేవలం ఒక మఠాధిపతి మాత్రమే, కానీ ఇప్పుడు రాజదండాన్ని మోడీకి ఆరుగురు మఠాధిపతులు కలిసి అందించారు.
కట్ చేస్తే.. ఈ 80 నుంచి 90 మందికి అయిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తున్నారనేది ఇప్పుడు నెటిజన్లు అడుగుతున్న ప్రధాన ప్రశ్న. వీరి మూడు రోజుల బసకు 5స్టార్ హోటళ్లు.. వీరికి భోజనాలు(ప్రత్యేకంగా).. ఇతర సౌకర్యాలు.. కార్లు.. వంటివి ఏర్పాటు చేసేందుకు సుమారు 5 కోట్ల వరకు బిల్లు అయినట్టు సమాచారం.
మరి ఈ ఖర్చును మోడీ ఏ ఖాతా నుంచి చెల్లించారనేది నెటిజన్ల ప్రశ్న. కేవలం ప్రచారం కోసం.. ప్రజాధనం వృథా చేయడం కంటే.. సంక్షేమ పథకాలతో ప్రజలకు పంచడాన్ని తప్పు పట్టడమేలా? అని అంటున్నారు.