Begin typing your search above and press return to search.

బెజోస్ అంత‌రిక్షం నుంచి అటేపోవాలి.. భూమ్మీద‌కు రావొద్దు.. ఆన్ లైన్లో ఉద్య‌మం!

By:  Tupaki Desk   |   22 Jun 2021 9:00 AM GMT
బెజోస్ అంత‌రిక్షం నుంచి అటేపోవాలి.. భూమ్మీద‌కు రావొద్దు.. ఆన్ లైన్లో ఉద్య‌మం!
X
అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ అంత‌రిక్ష యాత్ర‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. స్పేస్ ప్ర‌యోగాల కోసం సొంతంగా ‘బ్లూ ఆరిజిన్‌’ అనే సంస్థను స్థాపించిన బెజోస్.. ‘న్యూ షెఫర్డ్’ అనే వ్యోమ నౌకను అభివృద్ధి చేశారు. ఈ నౌక ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లి రానున్నట్టు ప్ర‌క‌టించారు. దీనిపై ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అంతేకాదు.. ఆన్ లైన్లో బెజోస్ యాత్ర‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్నారు. అంత‌రిక్షంలోకి వెళ్తున్న బెజోస్‌.. మ‌ళ్లీ భూమ్మీద‌కు తిరిగి రావొద్ద‌ని Change.org అనే వెబ్ సైట్ ఆధ్వ‌ర్యంలో సంత‌కాల సేక‌రిస్తున్నారు. 50 వేల సంత‌కాలు సేక‌రించే ల‌క్ష్యంతో మొద‌లు పెట్టిన ఈ ఉద్య‌మంలో.. ఇప్ప‌టి వ‌ర‌కు 30 వేల మందికి పైగా పాల్గొని త‌మ మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. ‘‘బిలియ‌నీర్లు భూమ్మీద ఉండొద్దు. వాళ్లు అంత‌రిక్షాన్ని సెల‌క్ట్ చేసుకుంటే అక్క‌డే ఉండాలి’’ అంటూ నినదిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 38, 892 మంది బెజోస్ కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు.

కాగా.. ఈ యాత్ర‌లో బెజోస్ తోపాటు ఆయ‌న‌ సోద‌రుడు మార్క్ బెజోస్ కూడా వెళ్తున్నారు. మొత్తం ఆరు సీట్లు ఉన్న ఈ స్పేస్ షిప్ లో మూడు సీట్ల‌లో వ్యోమ‌గాములు ఉంటారు. మ‌రో రెండు సీట్ల‌లో జెఫ్ బెజోస్, అత‌ని సోద‌రుడు కూర్చుంటారు. మిగిలిన ఒక్క సీటులో ఎవ్వ‌రైనా కూర్చోవొచ్చ‌ని వేలం వేశారు. ఈ వేలంలో ఓ వ్య‌క్తి ఏక‌తంగా 20 మిలియ‌న్ డాల‌ర్లు (మ‌న క‌రెన్సీలో 205 కోట్లు) చెల్లించి ఈ సీటును ద‌క్కించుకున్నాడు. అయితే.. ఈ టూర్‌ రోజుల్లో కాకుండా.. కేవ‌లం ప‌దంటే ప‌దే నిమిషాల్లో ముగుస్తుంది. ఆకాశంలోకి 100 కిలోమీట‌ర్ల పైకి వెళ్లి.. మ‌ళ్లీ పారాషూట్ స‌హాయంతో నేల‌కు దిగుతుంది.