Begin typing your search above and press return to search.

బాబుగారూ.. మీరు జ‌గ‌న్‌ని తిడితే... గెల‌వ‌లేరు.. అదేంటో ఈ స్టోరీ చూద్దాం!

By:  Tupaki Desk   |   4 May 2021 9:30 AM GMT
బాబుగారూ.. మీరు జ‌గ‌న్‌ని తిడితే... గెల‌వ‌లేరు.. అదేంటో ఈ స్టోరీ చూద్దాం!
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు ఎదుర్కొంటున్న ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి దుస్థితి చూసి ఉండ‌దు. నిజానికి చంద్ర‌బాబు త‌న రాజ‌కీయాల్లో ఇందిరాగాంధీ వంటి మేధావుల నుంచి అనేక మందిని చూశారు. రాజ‌కీయంగా ఓ ఊపు ఊపిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వంటి వారితోనూ ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. రాజ‌కీయంగా చక్రం తిప్పారు. అలాంటి చంద్ర‌బాబుకు ఇప్పుడు ఒక చిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. అంటున్నారు విశ్లేష‌కులు.

ప్ర‌ధానంగా.. వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ వేస్తున్న ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌లేక‌, వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాలు వేయ‌లేక‌.. చ‌తికిల‌ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు రాజ‌కీయ కురువృద్ధుడు చంద్ర‌బాబు చుట్టూ తిరుగుతున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితం.. త‌ర్వాత జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వంటి వాటిలో వైసీపీ దూకుడు, జ‌గ‌న్ వ్యూహాల విష‌యంలో చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఒక‌ర‌కంగా జ‌గ‌న్‌.. బాబాను మ‌ట్టిక‌రిపించిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు రాజ‌కీయంగా చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌నే విష‌యంలో వాస్త‌వం చాలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, లోకేష్ విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ మాదిరిగా లోకేష్ డైన‌మిక్ నాయ‌కుడు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. పార్టీని బ‌తికించుకునేందుకు ఇంకెవ‌రైనా ఉన్నారా? అంటే.. ఎదురుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపిస్తున్నా.. చంద్ర‌బాబు ఆయ‌న‌ను రానీయ‌డం లేదు. పోనీ.. లోకేష్ ఏమైనా ఎదుగుతున్నాడా? పార్టీని డెవ‌ల‌ప్ చేస్తు న్నారా? అంటే.. అది కూడా లేదు. పైగా యువ నేత‌ల‌ను కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు... పోనీ ఇప్పుడు ప‌ట్టించుకుందామా? అంటే.. పార్టీనే ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా కేడ‌ర్ కూడా లేదు. పార్టీ బాగున్న‌ప్పుడు సీనియ‌ర్లు.. వారిని ఎద‌గ‌నివ్వ‌లేదు. ఇప్పుడు చాన్స్ ఇద్దామంటే.. అస‌లు పార్టీనే లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం జూనియ‌ర్ నేత‌లు అయితేనే..దేనికైనా రెడీ అంటున్నారు. కానీ, సీనియ‌ర్లు ఖ‌ర్చు పెట్ట‌రు. పెడితే.. ఊరుకోరు... వాస్త‌వానికి ఇప్పుడున్న రాజ‌కీయాల్లో డ‌బ్బులు లేనిదే ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. రాజ‌కీయాల‌కు డ‌బ్బుల‌కు అవినాభావ సంబంధం భారీగా పెరిగిపోయింది. ఇక‌, వైసీపీని తీసుకుంటే.. ఇక్క‌డ అంద‌రూ దాదాపు యువ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంతేకాదు, వాళ్లు దేనికైనా సై! అంటున్నారు. మ‌రి ఈ త‌ర‌హా ప‌రిస్థితి టీడీపీలో లేదు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో కొంత‌మందికి టికెట్లు ఇచ్చినా.. వైసీపీ సునామీ ముందు వారు ఓడిపోయారు. మ‌ళ్లీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని టీడీపీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఉదాహ‌ర‌ణ‌కు దివంగ‌త నాయ‌కుడు, అనంత‌పురంలో గ‌ట్టి పట్టున్న‌ ప‌రిటాల ర‌వికి జిల్లాలో మంచి ప‌లుకుబ‌డి కూడా ఉందేది. కానీ, ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ్రీరామ్‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచే ప‌రిస్థితి లేకుండా పోయింది. అందుకే.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రాప్తాడును కాద‌ని.. మ‌ళ్లీ ధ‌ర్మ‌వ‌రం వైపు దృష్టి పెడుతున్నారు. అయితే.. ఇక్క‌డ కూడా అత‌నికి అంత సీన్ లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు మారాల‌ని.. టీడీపీ శ్రేణులే లోలోన గుస‌గుసలాడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ త‌రానికి ఉప‌యోగ ప‌డే నేత‌ల‌ను త‌యారు చేయాల‌ని అంటున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ శ్రేణుల మ‌ధ్య జ‌రుగుతున్న సంభాష‌ణ‌. అంతేత‌ప్ప‌.. జ‌గ‌న్‌ను తిట్టిపోయ‌డం వ‌ల్ల పార్టీకి, చంద్ర‌బాబుకు కూడా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు.