హిట్లర్ గొప్పవాడంటూ ఇజ్రాయిల్ రాయబరికి నెటిజన్ కౌంటర్

Sun Dec 04 2022 12:03:51 GMT+0530 (India Standard Time)

Kashmir Files Effect Netizens Counter To Israel Ambassador

కశ్మీర్ పండిట్ల ఉచకోతను ఆధారంగా తెసుకొని దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి  ది కాశ్మీర్ ఫైల్స్  అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 15 కోట్ల చిన్న బడ్జెట్ తో నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్ తెచ్చుకొని సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.ఈ చిత్రాన్ని ఆపేందుకు కోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేయగా వాదోపవాదాలు విన్న బాంబే కోర్టు సినిమా విడుదల స్టేను ఎత్తివేసింది. ది కాశ్మీర్ ఫైల్స్  విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. అయితే ఈ మూవీపై  ఇఫీ  జ్యూరీ హెచ్.. ఇజ్రాయెల్ దర్శకుడు సడవ్ లాపిడ్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాను  ఎన్నికల ప్రచారం కోసం అసభ్యంగా చిత్రీకరించారని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే లాపిడ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యకంకావడంతో భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నావొర్ గిలాన్ స్పందించాల్సి వచ్చింది. లాపిడ్ వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ భారత ప్రభుత్వానికి నావొర్ గిలాన్ క్షమాపణ చెప్పారు.

ఇదే సమయంలో తనకు విద్వేష పూరిత సందేహాలు వస్తున్నాయంటూ తన ట్విటర్లో ఒక సందేహాన్ని స్క్రీన్ షాట్ తీసి పోస్టు చేశారు. మీలాంటి వ్యక్తులను అంతం చేసిన హిట్లర్ గొప్పవాడు.. వెంటనే భారత్ నుంచి వెళ్ళిపొండి.. అంటూ ఆ మేసేజ్ లో రాసి ఉంది. ఒక పీహెచ్డీ విద్యార్థి తనకు ఈ మేసేజ్ పంపించాడని.. అతడి వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ ట్వీట్ పై స్పందించారు.

ఇంకా కొందరిలో జాతివివక్ష భావాలు ఉన్నాయని ఈ పోస్ట్ ద్వారా చేయాలని అనుకుంటున్నా.. మనమంతా కలిసి దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. గిలాన్ వ్యాఖ్యలకు పలువురు మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉండే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలపై హిట్లర్ నేతృత్వంలోని నాజీలు లక్షలాది మంది యూదులను ఊచకోత కోశారు.

నేటికీ కూడా హిట్లర్ పేరు చెబితే ఇజ్రాయిల్ దేశస్థులు భయపడుతూనే ఉంటారు. అంతలా వారిని హింసించిన హిట్లర్ సమర్థిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేయడం విషాదంగా మారింది. ఇదే సమయంలో ఇజ్రాయిల్ రాయబారి  ది కశ్మీర్ ఫైల్స్  పై లాపిడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు భారత్-ఇజ్రాయిల్ సంబంధాలు బలమైనవి అంటూ వ్యాఖ్యానించారు.