పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే.. దీక్షలు చేసే బాధ్యత వైసీపీ టీడీపీలకు లేదా?

Fri Oct 22 2021 17:00:01 GMT+0530 (IST)

Netizens Comments On Ycp And Tdp

రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరూ చూస్తున్నారు. నువ్వు నన్నావ్.. అంటే..నువ్వే నన్నావ్!! అంటూ అధికార పార్టీ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు.. రోడ్డున పడ్డాయి. నువ్వు తిట్టావ్ కాబట్టి.. నేను కొడతా.. అన్నట్టుగా వైసీపీ.. నేను చూస్తూ.. ఊరుకుంటానా? అంటూ.. టీడీపీ మొత్తానికి రాజకీయాలను రోడ్డెక్కించా రు. ఈ పరిణామాలను గమనిస్తే.. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా ఈ రెండు పార్టీలు.. రోడ్డున పడ్డా యి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నాయకులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం.. దరిమిలా.. రచ్చ రంబోలా.. అయింది.!అయితే.. వాస్తవానికి అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి ఇంతకు మించిన రాజకీయం లేదా?  ఒకరి నొకరు తిట్టుకోవడం.. దూషించుకోవడం.. ఏపీ రాజకీయాల్లో కొత్తేంకాదు. అంతేకాదు.. అసెంబ్లీలోనే `బఫూన్` వ్యాఖ్యలు కొన్నేళ్ల కిందట దుమ్ము రేపాయి. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది. ఇక ఇటీవల చేసిన బోష్‌డీకే వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే.. వీటిని రాజకీయంగానే చూడాల్సిన ఇరు పార్టీలు.. ప్రజాసమస్యలు లేనట్టుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా మారిన కేంద్రం నిర్ణయాలపై అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ .. ప్రశ్నించే ప్రయత్నం చేయడం లేదు.

అంతేకాదు.. ఎక్కడా కనీసం ఈ రెండు పార్టీలూ.. కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. ఉదాహరణకు చూసుకుం టే.. ప్రస్తుతం రోజూ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో ఏపీ ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ ధరల పె రుగుదల పుణ్యమా అని.. ఇతర నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. దీంతో కూరగాయల ధరలు పెరిగి.. ఇబ్బందులు పడుతున్నారు. వీటి విషయంలో ఈ రెండు పార్టీలకూ బాధ్యత లేదా? అనేది ప్రశ్న. ఇటీవల కమ్యూనిస్టు నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బోష్‌డీకే సమస్యపై ఉన్న శ్రద్ధ.. ప్రజల సమస్యలపై వైసీపీకి టీడీపీకి లేవా? అని నిలదీశారు.

నిజమే..ఎందుకంటే.. రాష్ట్ర విభజనతో తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీకి .. కేంద్ం నుంచి అనేక విషయాల్లో ఊతం అందాలి. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. మాత్రం.. ఏపీని పూచిక పుల్లగా చూస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోంది. రైల్ కోచ్ ప్యాక్టరీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొని ఇప్పుడు ఇవ్వడం లేదు. రాజధాని నిర్మాణానికి నిదులు ఇవ్వాల్సి  ఉన్నప్పటికీ.. ఇవ్వడం లేదు. పోలవరం అంచనా నిధులు ఇవ్వడం లేదు. కేవలం 2014 నాటి అంచనాలకే పరిమితమయ్యామని పదే పదే చెబుతోంది. ఇక ప్రత్యేక హోదా అనేది అటకెక్కించేశారు.

మరి రాష్ట్ర ప్రజలకు ఇన్ని సమస్యలు ఉండగా.. ఈ రెండు పార్టీలూ.. ఆయా సమస్యలపై ఎప్పుడైనా .. పోరాడాయా?  అంటే.. పెదవి విరుపే కనిపిస్తోంది. అంతేకాదు.. కేంద్రంలోని నరేంద్ర మోడీని నిలదీసే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనికి కారణం.. ఏంటి? అంటే.. మోడీకి ఈ రెండు పార్టీలూ భయపడు తుండడమే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టేసి.. బూతులు తిట్టుకుని.. నువ్వు నన్ను తిట్టావ్.. నువ్వు నన్ను కొట్టావ్.. అంటూ.. రోడ్డెక్కడం.. పై ప్రజలు నివ్వెర పోతుండడం గమనార్హం.

ఈ ఆర్టికల్‌పై మీదగ్గర ఏమైనా సమాచారం ఉంటే.. కామెంట్స్ రూపంలో పంపండి.. మేము ప్రచురిస్తాం. మీకు నచ్చితే.. లైక్ చేయండి.. షేర్ చేయండి.