Begin typing your search above and press return to search.
మళ్ళీ నెల్లూరు : అనిల్ బస్తీ మే సవాల్..!
By: Tupaki Desk | 24 Jun 2023 1:09 AM ISTనెల్లూరు వైసీపీకి ఎన్నికల వేళ షాకుల మీద షాకులు ఇచ్చేలా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న వైసీపీ నుంచి కొద్ది నెలల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ కాబడ్డారు ఇపుడు చూస్తే జగన్ కి వీర విధేయుడుగా పేరు గడించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బిగ్ సౌండ్ చేస్తున్నారు.
నెల్లూరు సిటీలో తన బలమేంటో చాటి చెప్పాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. నెల్లూరు సిటీ నుంచి రెండు సారు గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ కి జగన్ ప్రభుత్వం రాగానే అత్యంత కీలకమైన జల వనరుల శాఖ మంత్రి పదవి దక్కింది. ఇక ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో హవా చాటుకున్నారు.
మాజీ మంత్రి కాగానే కష్టాలు మొదలయ్యాయి. ఆయన చుట్టూ ఉన్న వారు అంతా బయటకు వెళ్ళిపోయారు. దాంతో పాటు రెండు ఎన్నికల్లోనూ అనిల్ ని బలపరచి గెలిపించిన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వేరు కుంపటి పెట్టేసారు. ఆయన నెల్లూరు కార్పోరేషన్ లో డిప్యూటీ మెయర్ గా ఉన్నారు. ఆయన సొంతంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మరీ సమాంతరంగా వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఆయనకు అనిల్ కి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. దీని మీద నేరుగా జగన్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అయినా ఇద్దరి మధ్య పతాక స్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో హై కమాండ్ వద్ద అనిల్ కుమార్ పరపతి నెమ్మదిగా తగ్గుతూండగా రూప్ కుమార్ యాదవ్ కి హై కమాండ్ ఈ మధ్య విలువ పెరుగుతొంది. దీనికి తోడు పనితీరు బాలేదని కూడా సర్వే నివేదికలు చెబుతున్న నేపధ్యం.
ఈ క్రమంలో అటు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కి ఇటు హై కమాండ్ కి తెలిసేలా తన బలాన్ని చూపించాలని అనిల్ కుమార్ యాదవ్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయన నెల్లూరు సిటీలోని ఒక కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు పేరిట ఒక కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అనిల్ అభిమానులు మద్దతుదారులు, అనుచరులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.
దీంతో నెల్లూరు సిటీలో తన బలమెంతో నేరుగానే హై కమాండ్ కి చూపించవచ్చు అన్నదే అనిల్ పంతంగా ఉంది అని అంటున్నారు. ఒక వేళ అధినాయకత్వం కనుక అనిల్ కి టికెట్ నిరాకరించే పక్షంలో కఠిన నిర్ణయం వైపు అనిల్ కుమార్ యాదవ్ వెళ్తారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ బల ప్రదర్శన నెల్లూరు వైసీపీలో ఇపుడు వేడిని రగిలిస్తోంది.
నెల్లూరులోనే ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. ఇపుడు అనిల్ కూడా అదే బాటన పడతారా ఆయన ఆత్మీయ సమావేశంలో చేసే ప్రకటనలు ఎవరిని గురి పెడతాయి సొంత బాబాయ్ ని టార్గెట్ చేసి ఊరుకుంటారా లేక హై కమాండ్ పోకడల మీద కూడా ఏమైనా మాట్లాడుతారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.