Begin typing your search above and press return to search.

తల్లికి నెగెటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్

By:  Tupaki Desk   |   12 July 2020 4:15 AM GMT
తల్లికి నెగెటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్
X
కరోనా చిత్రాలు విచిత్రాలు సృష్టిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ సోకుతుంది. పుట్టిన పాపాయి నుంచి పండు ముసలిదాకా అందరినీ సమానంగా చూస్తోంది.

అయితే తాజాగా దేశంలోనే ఓ వింత కేసు నమోదైంది. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.. అక్కడే ఈ చోద్యం చోటు చేసుకుంది.

ఢిల్లీకి చెందిన ఓ గర్భిణికి ఈనెల 7న కరోనా టెస్టు చేయగా.. నెగెటివ్ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత రోజే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఆ పుట్టిన బిడ్డకు కరోనా టెస్ట్ చేయగా.. బిడ్డకు కరోనా పాజిటివ్ అని తేలడం సంచలనమైంది. బొడ్డు ద్వారా బిడ్డకు కరోనా సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ కేసు మిస్టరీగా మారింది.