Begin typing your search above and press return to search.

నీలం సాహ్నిని తొలగించాలి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందెవరు?

By:  Tupaki Desk   |   17 Jun 2021 4:30 AM GMT
నీలం సాహ్నిని తొలగించాలి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందెవరు?
X
ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న మాజీ సీఎస్.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నికి మరో తలనొప్పి మొదలైంది. ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆమె.. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయటం.. దాన్ని కొట్టివేస్తూ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఆమెను నియమించటాన్ని సవాలు చేస్తూ తాజాగా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

అంతేకాదు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమకానికి సంబంధించి ముగ్గురుపేర్లతో ప్రభుత్వం తయారు చేసిన ప్యానల్ ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి.. జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణకు ఓకే చెప్పింది.. అయితే.. ప్రధాన పిటిషన్ లో అన్ని వివరాలు వెల్లడించకుండా.. ప్రత్యేక పిల్ ఎందుకు దాఖలు చేసినట్లు? అంటూ ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్ ను విజయవాడకు చెందిన జి.రామకృష్ణ అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ కేసు విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.