Begin typing your search above and press return to search.

కరోనాకు ప్రస్తుతం అదే గొప్ప వ్యాక్సిన్‌

By:  Tupaki Desk   |   2 April 2020 3:30 PM GMT
కరోనాకు ప్రస్తుతం అదే గొప్ప వ్యాక్సిన్‌
X
కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తంను ప్రభావితం చేస్తోంది. ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తూ కరాళ నృత్యం చేస్తోంది. ఈ సమయంలో కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఎంత స్పీడ్‌ గా వ్యాక్సిన్‌ కనిపెట్టినా కూడా కనీసం సంవత్సరం అయినా పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపు ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం చాలా అవసరం. అందుకే ఇప్పుడు అందరి దృష్టి క్షయ వ్యాది నివారణకు ఇచ్చే బీసీజీ టీకాపై పడినది.

న్యూయార్క్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గోంజాలో ఒటాజు ఒక ఆసక్తికర విశ్లేషణను అందించాడు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దేశాలను.. మెల్లగా వ్యాప్తి చెందుతున్న దేశాల జీవితాను తయారు చేయగా ఆ జాబితాలో మెల్లగా కరోనా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో బీసీజీ టీకాలు వాడుతున్నట్లుగా ఒటాజు టీం నిర్థారణకు వచ్చింది. అమెరికాతో పాటు ఇటలీ ఇంకా ప్రముఖ దేశాలు కొన్ని క్షయ వ్యాది పూర్తిగా నయమయ్యిందనే ఉద్దేశ్యంతో బీసీజీ టీకాలను ఇవ్వడమే మానేసింది. ఇప్పుడు ఆ టీకాలు తీసుకోని వారు కరోనాకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లుగా ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.

చైనాలో బీసీజీ టీకాలు ఇంకా అమలులో ఉన్నాయి. కనుక అక్కడ పరిస్థితి భయంకరంగా మారలేదు అనేది ఆ విశ్లేషణ యొక్క సారాంశంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరిస్థితి చేయి దాటిన వారికి బీసీజీ టీకాలు ఇవ్వడం వల్ల ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉదృతి అత్యధికంగా ఉన్న దేశాల వారు బీసీజీ టీకాను సూచిస్తున్నట్లుగా గుర్తించామని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం టీకా తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీజీ పూర్తి స్థాయి టీకా కాదు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాల్సిందే అంటూ ఒటాజు చెప్పారు. ఈ విపత్తు కాలంలో జాగ్రత్తలు పాటించడం మాత్రమే అతి పెద్ద ఔషదంగా ఆయన పేర్కొన్నాడు.

--