నోటు పై నాథురాం గాడ్సే: నాగబాబు చెప్పినట్టు ఏబీవీపీ నాయకుడి చేశాడు

Mon May 25 2020 16:00:01 GMT+0530 (IST)

Nathuram Godse on note: ABVP leader as Nagababu says

మొన్న హఠాత్తుగా జనసేన పార్టీ నాయకులు సినీ నటుడు నాగబాబు నాథురాం గాడ్సేపై విపరీతమైన అభిమానం చూపారు. గాంధీని హత్య చేసిన వ్యక్తిని కీర్తించాడు. తాజాగా ఓ వ్యక్తి నాథురామ్ గాడ్సేను కీర్తిస్తూ ఏకంగా పది రూపాయల నోటుపై అతడి బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు తెగ వైరలైంది. ఈ విధంగా చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. రూ.10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మను పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే ఆ విధంగా చేసినది ఎవరో కాదు బీజేపీకి చెందిన విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడు.మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాకు చెందిన శివమ్ శుక్లా ఏబీవీపీ నాయకుడు. అతడు మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను హీరోగా పేర్కొంటూ రూ.పది నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే ఫొటో పెట్టాడు. ఈ సందర్భంగా ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో  పెట్టి 'లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే' అంటూ శుక్లా పోస్ట్ చేశాడు. ఎందుకు చేశాడంటే మే 19వ తేదీన గాడ్సే 111వ జయంతి సందర్భంగా శివమ్ శుక్లా ఆ పోస్ట్ చేశాడు.

దీంతో పాటు రఘుపతి రాఘవ రాజా రామ్ దేశ్ బచ్చా గే నాథూరాం' (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొంటూ పోస్టు చేశాడు. ఈ సందర్భంగా గాడ్సేను మహాత్మా అని సంభోదించాడు. పూజ్య పండిట్ నాథూరాం గాడ్సే అమర్ రహీన్ (గౌరవనీయ నాథురాం గాడ్సే అమర్ రహే) అంటూ పలు పోస్ట్‌లు చేశాడు. ఈ పోస్టు చూసిన వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్‌కు సంబంధించిన విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్‌ఎస్‌యూఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతడు ఏబీవీపీకి చెందిన వ్యక్తి కావడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ విమర్శల పై ఏబీవీపీ స్పందించింది. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి కాంగ్రెస్ పై ఆ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.