Begin typing your search above and press return to search.
మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ.. అన్నగారి మాట
By: Tupaki Desk | 28 May 2023 1:52 PMప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమం ఈ రోజు అంటే.. మే 28న నిర్వహించారు. ఇది 101వ మన్‌కీ బాత్. అయితే.. ఈ సారి ఆయన అన్నగారు తెలుగు వేల్పు నందమూరి తారక రామారావు శత జయంతిని ప్రస్తావించారు. తెలుగు వారికే కాకుండా.. ఎన్డీయే కూటమిలో నూ నేషనల్ ఫ్రంట్ స్థాపనలోనూ ఎన్టీఆర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు.
ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని అందిపుచ్చుకుని తెలుగు వారి కోసం ఎంతో త్యాగం చేశారని కొనియాడారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నివాళులు అర్పించానని తెలిపారు. రాజకీయ, సినీ రంగాల్లో ఎన్టీఆర్ అద్భుతంగా రాణించారని మోడీ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీ రంగంలో ఖ్యాతిగాంచారని మోడీ తెలిపారు.
ఎన్టీఆర్ కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 300కు పైగా చిత్రాల్లో నటించి అలరించారన్నారు. తన నటనతో అనేక పౌరాణిక పాత్రల కు జీవం పోశారని.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటన ను ఇప్పటికీ స్మరిస్తారని వెల్లడించారు. ఎన్టీఆర్ లక్షలాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని తెలిపారు. శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని మోడీ తెలిపారు. ఇదే విషయం పై ఆయన ట్వీట్ కూడా చేయడం గమనార్హం.