మోడీకి తిరుగే లేదు: లేటెస్ట్ సర్వే

Wed Apr 24 2019 16:03:56 GMT+0530 (IST)

Narendra Modi first choice for PM, way ahead of Rahul Gandhi: Cvoter-Ians tracker

ఒకవైపు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నా - మోడీ వ్యతిరేకులు రకరకాల ప్రయత్నాలు  సాగిస్తూ ఉన్నా మోడీ మానియాను మాత్రం ఎవరూ మరుగు చేయలేకపోతున్నారని అంటున్నాయి సర్వేలు. ఏప్రిల్ నెలలో ప్రజానాడి ఎలా ఉందనే అంశం గురించి జరిగిన ఒక పరిశీలన ఇదే అంశాన్ని చెబుతూ ఉంది. సీ ఓటర్- ఐఏఎన్ ఎస్ ట్రాకర్ ఈ విషయాన్ని చెబుతూ ఉంది.ప్రధానమంత్రిగా  ప్రజల ఎంపిక  విషయంలో మోడీకి సాటి వచ్చే వారు లేరని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారనే అంశం గురించి ప్రజల ముందు కొన్ని పేర్లను ఛాయిస్ గా  ఉంచగా.. వాటిల్లో మెజారిటీ మంది ప్రజలు  మోడీ వైపే ముగ్గు చూపుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రత్యేకించి కాంగ్రెస్ జాతీయాధ్యాక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో మోడీకి చాలా చాలా దూరంలో ఉన్నారని ఈ అధ్యయనం  ప్రకటించింది.

దాదాపు పన్నెండు వేల శాంపిల్స్ తో చేసిన ఈ అధ్యయనంలో యాభై ఆరు శాతం మంది మళ్లీ ప్రధానిగా మోడీనే ఎంచుకున్నారని ఈ సర్వే పేర్కొంది. రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలన్న వారి శాతం కేవలం ఇరవై రెండు మాత్రమే అని  అధ్యయనం వివరించింది. అంటే రాహుల్ కన్నా మోడీ ఏకంగా ముప్పై ఐదు శాతం ముందున్నారు. ఇలా ప్రధానమంత్రి రేసులో మోడీ  తిరుగు లేకుండా  దూసుకుపోతూ ఉన్నారు.

ఏప్రిల్ 20వ తేదీ ఈ అధ్యయనాన్ని చేసినట్టుగా ఆ అధ్యయన సంస్థ  ప్రకటించింది. మోడీ కాదంటే ప్రధానమంత్రిగా ఎవరన్న అంశంలో రెండో సమాధానం రాహుల్ గాంధీనే అయినప్పటికీ.. మోడీకి - రాహుల్ కు మధ్యన వ్యత్యాసమే చాలా ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు.

ప్రత్యేకించి హర్యానా - హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ - రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మోడీ పట్ల అనుకూలత ఏకంగా డెబ్బై శాతం ఉండటం విశేషం!