Begin typing your search above and press return to search.

అయోధ్య భూమి పూజ ... సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మోడీ !

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:30 PM GMT
అయోధ్య భూమి పూజ ... సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మోడీ !
X
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ ప్రధానిగా సరికొత్త అయోధ్యలోని రామ్ ‌లల్లాను దర్శించుకున్న మొట్ట మొదటి ప్రధాని నరేంద్ర మోదీయే. అయితే మోదీ కంటే ముందు ప్రధాని హోదాలో ఇందిరా, రాజీవ్, వాజ్‌పాయ్ అయోధ్యను ప్రధాని హోదాలో సందర్శించారు కానీ, రామ జన్మభూమి కు దూరంగా ఉంటూ వచ్చారు. ఆలయ భూమిపూజ ను పురస్కరించుకొని ప్రధాని హోదాలో దర్శించుకున్నారు.

ఇందిరా గాంధీ : 1966లో ఇందిర అయోధ్య పర్యటన చేశారు. అయోధ్యలోని సరయూ నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే తిరిగి వెళ్లిపోయారు. దీని తర్వాత 1979 లో మళ్లీ అయోధ్యకు వచ్చారు. అప్పుడు హనుమాన్ గఢీ ఆలయానికి వెళ్లి హనుమంతుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత 1975లో నరేంద్ర దేవ్ వ్యవసాయ యూనివర్శిటీ శంకుస్థాపనకు వెళ్లారు. ఈ మూడు పర్యటనల్లోనూ ఆమె రామ్ ‌లల్లాను దర్శించుకోలేదు.

రాజీవ్ గాంధీ : ఈయన ప్రధాని హోదాలో రెండు సార్లు, పూర్వ ప్రధానిగా ఓ సారి అయోధ్యలో పర్యటించారు. ఈయన ప్రధానిగా ఉన్న సమయంలో 1986 లో బాబ్రీ మసీద్ తెరిచి, శిలాన్యాసం చేశారు. 1984లో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అయోధ్య వచ్చారు. దీని తర్వాత 1989 లో ఎన్నికల ప్రచారాన్ని రాజీవ్ అయోధ్య నుంచే ప్రారంభించారు.

వాజ్‌ పాయ్ : ప్రధానిగా బాధ్యతలు చేపట్టక మునుపు అటల్ చాలా సార్లే అయోధ్యకు వచ్చారు. కానీ, ప్రధాని అయిన తర్వాత మాత్రం 2003 లో ప్రధాని హోదాలో వచ్చారు. అయితే రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామచంద్ర దాస్ పరమహంస్ మృతి చెందిన సమయంలో వచ్చారు. సరయూ తీరంలోనే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి వెనుతిరిగారు. దీనికంటే ముందు కూడా ఓ సారి వాజ్‌పాయ్ అయోధ్యకు వచ్చారు. సరయూ నదిపై నిర్మించిన రైల్వే వంతన ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2004 లో ఫైజాబాద్‌ లో జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇన్ని సార్లు వచ్చినా, వాజ్‌పాయ్ మాత్రం రామ్ లల్లా దేవాలయాన్ని సందర్శించకుండానే వెనుదిరిగారు.