బాబుపై కోపం కేసీఆర్ కు వరం..

Mon Aug 06 2018 20:00:26 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న కోపం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు వరమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి అడిగిందే తడవుగా ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. వీరిద్దరు గంటకు పైగా చర్చించుకున్నారు. ఇందులో తెలంగాణలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో జోనల్ వ్యవస్థ - కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు కీలకమైనవి. వీటికి కేంద్రం నుంచి అనుమతి తప్పక కావాలి. కేంద్రం అనుమతించకపోతే తెలంగాణలో  అనేక పనులు వెనుకబడతాయి.ముఖ్యంగా ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు వస్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జోనల్ వ్యవస్థకు కేంద్రం పచ్చ జేండా ఊపాలి. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో దౌత్యం నెరపారు. అది ఫలించి కేంద్రం జోనల్ వ్యవస్థకు అంగీకారం తెలిపింది. ఇది తెలంగాణకు శుభపరిణామం. దీని ద్వారా తెలంగాణలో అన్నీ పనులు చకచక జరిగిపోతాయి. కేసీఆర్ అడిగిందే తడవుగా ఆయన డిమాండ్లను అంగీకరించడం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇబ్బందుల పాలు చేయడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమతో సఖ్యంగా ఉంటే ఇటాంటి పనులు జరుగుతాయని వైరంతో వ్యవహరిస్తే తాము పట్టించుకోమనే సంకేతాలను చంద్రబాబుకు పంపినట్లు చెబుతున్నారు. అలాగే రాబోయే ఎన్నికలలో బిజేపి తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడికి ఎలాంటి సహకారం అందించమని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిజేపి సూచించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల మధ్య అగాధం పెరిగింది. ఈ కొత్త చర్యలతో అది మరింతా పెరగనుంది. తెలంగానకు కోరినవన్ని చేస్తున్న కేంద్రం భవిష్యత్తులో తమ రాజకీయ అవసరాలను తీర్చుకేనే దిశగా అడుగులు వేస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల  మధ్య విబేధాలు స్రుష్టించి రాజకీయంగా బలపడాలన్నది నరేంద్ర మెదీ వ్యూహంగా తెలుస్తోంది. పనిలో పనిగా తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావలంటూ టిఆర్ ఎస్ చేత డిమాండ్ చేయించే పనిని కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేబట్టనున్నారు. ఈ అస్త్రాన్ని ప్రయోగించి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టాలన్నది మోదీ వ్యూహంగా తెలుస్తోంది.