Begin typing your search above and press return to search.

మంత్రులూ... ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి: ఆర్ ఆర్ ఆర్ వార్నింగ్

By:  Tupaki Desk   |   1 Oct 2022 4:42 AM GMT
మంత్రులూ... ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి:  ఆర్ ఆర్ ఆర్ వార్నింగ్
X
మంత్రులైన వాళ్ళ బాబు లైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలు హర్షించరని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. అమరావతి మహిళా రైతులు కాళ్లు కందిపోయినా పాదయాత్ర చేస్తుంటే కొంతమం ది మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని. పశువులు కూడా వీళ్ళ భాషను చూసి అసహ్యించుకుంటున్నాయని విరుచుకపడ్డారు. ఆస్తులు. కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి, ప్రభుత్వం చేతిలో మోసపోయి, గత మూడున్నర ఏళ్లుగా న్యాయం కోసం దీక్షలు చేస్తూ పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారని గుర్తుచేశారు.

మంత్రుల పాపానికి పరిహారం లేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మంత్రులు, ప్రజలకు దూరం కాకుండా ఉం డాలంటే వారి పరిధిలో ఉండి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. కొంతమంది తమను కాళ్లు విరగొడతామని బెదిరిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందేనని, అమరావతి రైతుల కాళ్లు విరగ్గొడతామంటే ప్రజలు ఊరుకోరని రఘురామకృ ష్ణం రాజు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక పేరిట మూడు రాజధానులు కావాలని, లేకపోతే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ ఊరు పేరు లేని పాల్. సత్యనారాయణ ల పేరిట ప్రజల సొమ్మును ప్రకటనల రూపంలో దండుకుం టున్న జగన్ సొంత దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు.

అమరావతి రైతులకే రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్నదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా తాము పాదయాత్రలు చేయలేమా? అని ప్రశ్నించిన మంత్రులు, ఒక్క సభ పెడితే.. అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. తిరుపతిలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సభను ఏర్పాటు చేస్తే వం దమంది కూడా హాజరు కాలేదని గుర్తు చేశారు. వచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెళ్లిపోయారని పేర్కొన్నారు.

జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాటల వల్ల ఒక్కొక్కసారి మేలే జరుగుతుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. రుషికొండపై ముఖ్యమంత్రి నివాస భవనాన్ని, కార్యాలయాన్ని నిర్మించుకోవద్దా! అని బొత్స చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, రుషికొండకు గుండు కొట్టి జగన్ నివాస సముదాయం, కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఇంటర్లో కాలేజీకి న్కూటర్ పై, డిగ్రీలో కారులో వెళ్లిన బొత్స సత్యనారాయణ, రుషికొండ పై నిర్మిస్తున్న భవనాల గురించి సూటిగానే చెప్పారన్నారు. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిం చిన దానికంటే పది రెట్లు పెద్ద సైజు భవనాలనే రుషికొండపై నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలు సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. సముద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడి పెద్ద పెద్ద భవనాలను నిర్మించడం దారుణమని మండిపడ్డారు.

గాలి జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మీద ఉన్న కేసులకు పెద్ద తేడా లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ట్రయల్స్ ప్రారంభమైతే చచ్చినట్లు. కోర్టుకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్స్ ప్రాంరభం కాకపోతే పర్వాలేదుకానీ ప్రారంభమైతే మాత్రం, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ కూడా. పనిచేయదన్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టి కష్టాలు పెడితే.. అంతా భగవంతుడు చూసుకుంటాడని అన్నారు. దసరా సెలవులు అనంతరం కోర్టు ప్రారంభమైన తర్వాత ఏమి జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు. సిట్ నివేదికను బహిర్గతం చేయాలి..

విశాఖ భూకుంభకోణంపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాయితీపరులైన అధికారులు డాక్టర్ విజయ్ కుమార్, అనురాధ, ఇతరు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేశారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అయితే సిట్ బృందం ఎప్పుడో తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని, అయితే ఇప్పటివరకు ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే సిట్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికను బహిర్గతం చేయాలన్నారు.

రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్లను పునరుద్ధరించారని అయితే.. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్లను బాగుచేసుకుంటే కేసులు పెడతారా? అంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా వేలం పాట లో లడ్డు ను విక్రయించగా వచ్చిన సొమ్ముతో: గ్రామ ప్రధాన రహదారి గోతులను పూడ్చుకున్న తాడినాడ గ్రామస్తుడు బాబుపై ఐపీసీ 427 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వము రోడ్లు వేయదు... వేసుకుంటే కేసులు పెడుతుందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గౌరవం ఇవ్వండి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు సీఎం జగన్ రెడ్డి సముచిత గౌరవం ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు సూచిం చారు. వారేమి ముఖ్యమంత్రికి కట్టు బానిసలు కాదని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే వారు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రోడ్డు పైకి రావాలంటే భారీ కేడ్లు, పరదాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అయిందని ఎద్దేవా చేశారు..

"సీఎం రోడ్డుపైకి వచ్చినప్పుడు పరదాలు ఏర్పాటు చేసే బదులు ఆయన స్వయంగా బురఖా ధరిస్తే మంచిది కదా" అంటూ రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తనకు ఫోన్ చేసి సలహా ఇచ్చారని చెప్పారు, కుప్పంలో ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బటన్ నొక్కి ప్రజలకు నిధులు అందజేసినట్లు చెప్పారని అయితే. మంత్రి రోజా సెల్వమణి లబ్ధిదారులకు చెక్ అందజేయడం విదూరంగా ఉం దన్నారు. అంటే ముఖ్యమంత్రి బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా నిధులు విడుదల కాలేదని భావించాలా?, లేకపోతే రోజా సెల్వమణి అందజేసిన చెక్కు మోసమని అనుకోవాలా? అంటూ రఘురామకృష్ణం రాజు సందేహాన్ని వ్యక్తం చేశారు.

సినీ నటుడు దివంగత కృష్ణంరాజు కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉంటారని మంత్రి రోజా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రఘ రామకృష్ణం రాజు అన్నారు. సినీ నటుడు కృష్ణంరాజు, పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ కుటుంబానికి జగన్ అండదండలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు మరణిస్తే ఆయన పార్దీవ దేహాన్ని చివరి చూపు కూడా చూడడానికివెళ్లని సీఎం ఇప్పుడు ప్రేమ ఒలకబోయడం వెనక, రాజుల ఓట్లు గంపగుత్తగా వస్తాయన్న రాజకీయ ఎత్తుగడే కారణమై ఉంటుందని అన్నారు. ఇటీవల విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరైతే.. బిజెపిలోనే కొనసాగుతున్న కృష్ణంరాజును ఆ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.