Begin typing your search above and press return to search.

లోకేష్ సాక్షిగా వ్యూహాకర్తను సరికొత్తగా పరిచయం చేస్తున్న బాబు

By:  Tupaki Desk   |   1 Oct 2022 12:34 PM GMT
లోకేష్ సాక్షిగా వ్యూహాకర్తను సరికొత్తగా పరిచయం చేస్తున్న బాబు
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే వ్యూహాలకు పెట్టింది పేరు. బాబు ఒక వ్యూహం రూపొందించారు అంటే అందులో ప్రత్యర్ధులు చిక్కి విలవిలలాడాల్సిందే. అయితే 2018 తరువాత ఆయన వ్యూహాలు కలసిరాలేదు. దానికి కాలం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. అలాంటి చంద్రబాబు ఇపుడు తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం మొత్తం రంగరించి తనలోని వ్యూహకర్తను సరికొత్తగా బయటకు తీస్తున్నారు.

అది కూడా తెలుగుదేశం భవిష్యత్తు కోసం తన రాజకీయ వారసుడు లోకేష్ ఫ్యూచర్ కోసం. తాను పాదయాత్ర చేసినపుడు కూడా పెద్దగా టెన్షన్ పడని చంద్రబాబు ఇపుడు కుమారుడు పాదయాత్ర అంటే బిగ్ స్కేల్ తో దాన్ని కొలుస్తున్నారు. రాజకీయంగా రికార్డులు కొత్తగా క్రియేట్ చేయడానికి లోకేష్ పాదయాత్ర అంటూ టీడీపీలో అపుడే ప్రచారం స్టార్ట్ అయింది. ఇక ఈ నెల నుంచి లోకేష్ పాదయాత్ర నిజానికి మొదలు కావాల్సి ఉంది.

అయితే ముందస్తు ఎన్నికల సమాచారం ఏదీ లేకపోవడం వల్ల 2023 జనవరికి పాదయాత్ర వాయిదా పడింది. ఆ నెలలో 26 రిపబ్లిక్ డే వేళ లోకేష్ ఆర్భాటంగా పాదయాత్ర చేపట్టనున్నారు. మొత్తం 4 వేల పై చిలుకు కిలోమీటర్లు, 450 రోజులు ఏణ్ణర్ధం పాటు ఏకబిగిన సాగే ఈ పాదయాత్ర ఏపీలో జగన్ చేసిన 3750 కిలోమీటర్ల పాదయత్రను అధిగమించి కొత్త రికార్డులు సెట్ చేస్తుంది అని అంటున్నారు.

ఇక కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర అని అనుకుంటున్నారు. ఈ విషయం మీద పొలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. పాదయాత్ర ఏకంగా సుదీర్ఘ కాలం పాటు జరగాలి కాబట్టి దాని కోసం తెలుగుదేశం పార్టీ ఎలా దీన్ని విజయవంతం చేయాలి అన్న దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది. ప్రతీ నియోజకవర్గంలో కరడు కట్టిన తెలుగుదేశం వీరాభిమానులను వీఅయి మంది దాకా లెక్క తీసి మరీ చంద్రబాబు వారితో తొందరలోనే సమావేశం కాబోతున్నారు.

వీరంతా పార్టీ పెట్టిన నాటి నుంచి కొనసాగుతున్నావారే. వారిని ముందు పెట్టి పాదయాత్రను ఎక్కడికక్కడ సక్సెస్ చేయాలని బాబు ఆలోచించడమే ఆయనలోని వ్యూహకర్తకు శభాష్ అనేలా ఉంది మరి. పార్టీ నాయకుల కంటే వీరాభిమానుల చేతిలో లోకేష్ పాదయాత్ర పెడితే కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది అని అంటున్నారు. ఇక ఈ వేయి మందికి ఆ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరిగినన్నినాళ్ళూ వసతి భోజనాలూ పార్టీ చూసుకుంటుంది. వీరు చేయాల్సింది తమతో పాటు తమ స్నేహితులు బంధువులను కూడా లోకేష్ పాదయాత్రలో ఉండేలా చూసుకోవడం

ఎటూ పార్టీ కార్యకర్తలు ఒక వైపు ఉంటారు. జనాలు కూడా ఉంటారు. ఆ విధంగా ఎక్కడ చూసినా జన సందోహంతో చినబాబు పాదయాత్ర జాతీయ స్థాయిలో మారుమోగేలా ఉండాలని చంద్రబాబు పక్కా వ్యూహాలను రూపిందిస్తున్నారు అని అంతున్నారు. ఇక మీడియా అటెన్షన్ కూడా లోకేష్ పాదయాత్ర మీద ఉండేలా ఎప్పటికపుడు కవరేజి ఉండేలా చూసుకునేందుకు కూడా ప్రత్యేక టీమ్స్ తో టీడీపీ రెడీగా ఉంది అంటున్నారు. మొత్తానికి తమ కుమారుడు పాదయాత్ర కోసం చంద్రబాబులోని వ్యూహకర్త బయటకు వచ్చి కసిగా పధక రచన చేస్తున్నారు. ఇది కనుక హిట్ అయితే ఇక తెలుగుదేశం పార్టీ వెనక్కి తిరిగి చూసుకోనక్కరలేదు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.