Begin typing your search above and press return to search.

వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది: నారా లోకేశ్‌

By:  Tupaki Desk   |   17 May 2022 2:32 PM GMT
వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది:  నారా లోకేశ్‌
X
జ‌గ‌న్‌ పాల‌నలో పేదల పరిస్థితిని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు చెప్పిన గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మ‌హిళపై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయ‌మ్మకి స‌మాధానం చెప్పే ద‌మ్ములేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మ‌హిళపై వైసీపీ నేతల దాడిని నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయ‌మ్మకి స‌మాధానం చెప్పే ద‌మ్ములేకనే కంతేరులోని ఆమె ఇంటిపై దాడిచేసి బెదిరించారని మండిపడ్డారు.

జ‌గ‌న్‌ పాల‌నలో పేదల పరిస్థితిని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు వెంకాయమ్మ చెప్పారని, ఆ వీడియోను లోకేశ్‌ విడుదల చేశారు. వెంకాయ‌మ్మ, ఆమె కుటుంబ‌ స‌భ్యుల‌కు ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్రప‌రిణామాలు త‌ప్పవని హెచ్చరించారు. వైసీపీ ద‌గ్గర ఉన్నది కిరాయి మూక‌లైతే.. టీడీపీ ద‌గ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్షలాది మంది సైనికులని లోకేశ్‌ స్పష్టం చేశారు. నిర‌క్షరాస్య, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోందన్నారు. ఇలా మాట్లాడే 5 కోట్ల మందిపైనా జగన్ రెడ్డి దాడి చేయిస్తారా అని లోకేశ్‌ నిలదీశారు.

``జ‌గ‌న్‌రెడ్డి పాల‌నలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పిన ద‌ళిత మ‌హిళ క‌ర్ల‌పూడి వెంకాయ‌మ్మ‌కి స‌మాధానం చెప్పే ద‌మ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా?`` ``వెంకాయ‌మ్మ‌కి గానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కి గానీ ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్ర‌ప‌రిణామాలు త‌ప్ప‌వు. మీ ద‌గ్గ‌ర వున్న‌ది కిరాయి మూక‌లు..మా ద‌గ్గ‌ర ఉన్న‌ది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్ష‌లాది మంది సైనికులు. నిర‌క్ష‌రాస్య‌, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్ర‌తీ ఇంటా, ప్ర‌తీనోటా వినిపిస్తోంది.. ఐదుకోట్ల‌మందిపైనా దాడి చేయిస్తారా జ‌గ‌న్‌రెడ్డి గారు?`` అని లోకేశ్ వ‌రుస ట్వీట్లు చేశారు.

ఏం జ‌రిగింది?

గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన వెంకాయ‌మ్మ‌.. జగన్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె. వెంకాయమ్మ.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు మేలు చేసేలా లేవని వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటీన్లు తీసేయటం, రంజాన్-క్రిస్మస్ కానుకల్ని ఎత్తేయటం సరికాదంటూ తనదైన రీతిలో చెబుతూ జగన్ మండిపడ్డారు.

ఈ క్ర‌మంలో రాత్రికి రాత్రి తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆ మె క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వచ్చి వాపోయారు. కాగా, వెంకయమ్మపై జరిగిన దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వెంకాయమ్మను పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు ధైర్యం చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వెంకాయమ్మ వెల్లడిస్తే.. పథకం ప్రకారం దాడి చేశారని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో దళితులు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవన్నారు. బడుగులను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తే వదిలిపెట్టమని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. వెంకాయమ్మ విషయంలో ఏం చేస్తారో మహిళా కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.