Begin typing your search above and press return to search.

డామిట్ కథ అడ్డం తిరిగిందే.. చంద్రబాబు ఇంత తెలివిగా మాట్లాడుతున్నారేంటి?

By:  Tupaki Desk   |   31 March 2023 9:39 AM GMT
డామిట్ కథ అడ్డం తిరిగిందే.. చంద్రబాబు ఇంత తెలివిగా మాట్లాడుతున్నారేంటి?
X
గురి చూసి మరీ లక్ష్యాన్ని కాకుండా.. ప్రత్యర్థి కోరుకున్నట్లుగా తప్పులు చేసే క్రీడాకారులు కొందరు ఉంటారు. రాజకీయాల్లో ఇలాంటి తీరును అప్పుడప్పుడు ప్రదర్శింటారు టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు. అలాంటి ఆయన మీద కొద్దికాలంగా ఒక రూమర్ బాగా వైరల్ గా మారింది. బాబు వయసు మీదా.. ఆయన ఫిట్ నెస్ మీదా. .ఆయన వ్యవహారశైలి మీదా.. మాట తీరుపైనా పెద్దఎత్తున విమర్శలు కొంతకాలంగా వినిపించింది. ఎక్కువ మాట్లాడే కన్నా.. చేతల్లో చూపిస్తే బాగుంటుందన్న సలహాల్ని పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆయన ముందుకు వెళుతున్నారు.

అలాంటి చంద్రబాబు తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగం రోటీన్ కు భిన్నంగా సాగిందన్న మాట వినిపిస్తోంది. ఆయన ప్రసంగం మీద బీఆర్ఎస్ తో పాటు వైసీపీ వర్గాలు ఎంతో ఆసక్తిగా తిలకించినట్లుగా తెలుస్తోంది. సెంటిమెంట్ ను రగిలించేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా వదిలి పెట్టకూడదన్న పట్టుదలతో గులాబీ నేతలు కూర్చుంటే.. ఫ్యాన్ గాలికి బాబు మాటలు తోడవుతాయని భావించినా.. అందుకు భిన్నంగా అనవసరమైన ఇష్యూను ప్రస్తావించకపోవటమే ఇప్పుడు చర్చగా మారింది.

బాబు ప్రసంగం అన్నంతనే బంగారు కాజా చేతికి ఇచ్చి వెళతారన్న వాదనను చాలామందిలో ఉంది. అందుకు భిన్నంగా తన క్రెడిట్ ను తాను తీసుకోవటమే కాదు.. తన వైరి వర్గమైనా.. ఏపీ ప్రభుత్వం కోరుకున్నట్లుగా కాకుండా.. ఎంత అవసరమో అంతే మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. తమ హయాంలో సాధించిన ఘన విజయాల్ని ప్రస్తావించటం వరకే మాట్లాడటం.. అంతకు మించిన గొప్పలు చెప్పుకోకపోవటంతో పాటు.. తెలంగాణలోని అధికారపక్షానికి ఎలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సెంటిమెంట్ రగలకుండా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం. దీంతో.. అంత పెద్ద సభ తర్వాత గులాబీ నేతలు ఎవరూ పెద్దగా స్పందించకపోవటానికి కారణం ఇదే.

తన తీరుకు భిన్నంగా వ్యవహరించిన చంద్రబాబు.. మాట్లాడిన మాటలన్నీవ్యూహాత్మకంగా ఉన్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ను రాజుకునేలా చంద్రబాబు మాట్లాడితే.. బాగుండని చాలామంది గులాబీ అధినాయకత్వం భావించినా.. ఆ అవకాశాన్ని ఇవ్వలేదు చంద్రబాబు. అంతేకాదు.. జగన్ పాలన మీద నిప్పులు చెరిగిన ఆయన.. ఆ విషయంలో కించిత్ కూడా వెనక్కి తగ్గని వైనం కనిపిస్తూ ఉంటుంది.

తన ప్రసంగంలో భాగంగా ఓపెన్ గా పోల్చేసిన పోలికలు అందరికి అర్థమయ్యేలా ఉండటమే కాదు.. తెలంగాణలో పూర్తి అయిన గొప్ప ప్రాజెక్టుల్లో తన భాగస్వామ్యాన్ని ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తున్నదే. ఈ విషయంలో బాబు తీరుపై ఆసక్తికరచర్చ నడుస్తోంది. మొత్తంగా అందరి అంచనాలకు భిన్నంగా మాట్లాడిన చంద్రబాబు మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.