Begin typing your search above and press return to search.

లోకేష్ కి రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్ .. !

By:  Tupaki Desk   |   23 Jan 2020 12:45 PM GMT
లోకేష్ కి రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్ .. !
X
ఎమ్మెల్సీ నారా లోకేష్ కు దివంగత నేత - మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రాజకీయ బిక్ష ఎలా పెడతాడని మీరు ఆలోచిస్తున్నారు కదా . రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ అమెరికాలో ఉన్నత చదవులు చదవడానికి వెళ్ళాడు. కానీ, ఇక్కడే మీరొక లాజిక్ మిస్ అయ్యారు ..అదే లాజిక్ ఇప్పుడు మంత్రి కొడాలి నాని తెరమీదకి తీసుకువచ్చారు. అసలు విషయం ఏమిటంటే .. ఆంధప్రదేశ్ శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజధాని తరలింపు బిల్లులను ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడంపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మండలిని టీడీపీ కార్యాలయంగా మార్చేశారని - ప్రభుత్వ విధానాలకు అడ్డుపడుతున్న మండలి అసలు మనకు అవసరమా? అనే ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే లోకేష్‌ కు చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టారని అందరు అనుకుంటారని.. కానీలో అందులో నిజం లేదని, లోకేష్‌ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డే రాజకీయ భిక్ష పెట్టారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇదెలా అంటే .. ఎన్టీరామారావు అప్పట్లో మండలిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ మండలిని అయన పునరుద్దరించారు. చట్టసభల్లో పెద్దలు ఉంటే బాగుంటుందని ఆయన మండలిని తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు చెత్తనంత తెచ్చి మండలిలో కూర్చోబెట్టారు. మండలి లేకుంటే లోకేష్ ఎమ్మెల్యే ఎప్పుడయ్యేవాడు..? చంద్రబాబు లోకేష్‌ ని ఏమీ చేయలేడు. లోకేష్‌ కి చట్టసభల్లో అవకాశం కల్పించి మంత్రిని చేసిన ఘనత వైఎస్‌ కే దక్కుతుంది అని కొడాలి నాని అన్నారు.

మండలిలో మేధావులు ఉంటే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారని వైఎస్ భావించారని.. కానీ చంద్రబాబు మాత్రం చెత్తను తీసుకొచ్చి పెట్టారని విమర్శించారు మంత్రి - తనలాంటి చదువుకోనోళ్లు ప్రజా బలంతో అసెంబ్లీలో ఉన్నామని, ఇక మండలిలో కూడా చదువుకోనోళ్లే వెళ్తే లాభమేంటి? ప్రశ్నలు సంధించారు.ఇక ఇంకా అయన మాట్లాడుతూ ... ప్రతిసారి తాను 40 ఏళ్ళ రాజకీయ అనుభవం తాను ఒక్కడినే దేశంలో సీనియర్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబుని ఏకంగా శాసన మండలి గ్యాలరికి ఎక్కించిన చరిత్ర జగన్ అని, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గ్యాలరీ పైకి కూడా సీఎం జగన్ ఎక్కిస్తాడని నాని ఫైర్ అయ్యాడు.