తారకరత్న హెల్త్ కండిషన్.. బాలయ్యను ఎప్పుడూ ఇలా చూడలే!

Sun Jan 29 2023 10:35:41 GMT+0530 (India Standard Time)

Nandamuri Balakrishna In Hospital

రెండు రోజులు అయినా సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మరింత ఎక్కువ అవుతోంది తారకు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మునపటిల హుందాగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే నరసింహం బాలకృష్ణ చాలా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. తారక్ పరిస్థితి విషమించడంతో బాలయ్య చాలా డీల పడిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీడియాలో వస్తున్నాయి. దీన్ని చూసిన బాలయ్య అభిమానులు కూడా ఎంతో బాధపడుతున్నారు. బాలయ్యను ఎప్పుడు ఇలా చూడలేదని చెబుతున్నారు. ధైర్యంగా ఉండాలని అంటున్నారు. దేవుడా ఆ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాడని పేర్కొంటున్నారు.ఇదీ జరిగింది.. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంతరం డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బులెటిన్లో ప్రకటించారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస కొనసాగుతోందని వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్నకు ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు.దీంతో అప్పటినుంచి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇపుడు వారు తాజా హెల్త్ బులిటెన్ విడుదల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.   

ఇకపోతే తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉండి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు బాలయ్యను అడిగి తెలుసుకుంటున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యంపై బాలయ్యను అడిగి ఆరా తీశారు. ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.