Begin typing your search above and press return to search.

బాలయ్య రియాక్షన్ అదేనట : సీమలో దబిడి దిబిడేనా...?

By:  Tupaki Desk   |   26 Sep 2022 5:47 AM GMT
బాలయ్య రియాక్షన్ అదేనట : సీమలో దబిడి దిబిడేనా...?
X
బాలక్రిష్ణ టాలీవుడ్ సీనియర్ నటుడు. ఆయన రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. తన సినిమాలూ తానూ అన్నట్లుగా ఉంటారు. ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నా కేవలం హిందూపురానికే పరిమితం అవుతారు. ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పులా పాలిటిక్స్ ఉన్నా కూడా బాలయ్య మాటల దాడి చేసింది ఎక్కడా లేదు. ఒకసారి ఆయన తన బాబు సతీమణి తన సోదరి విషయంలో వైసీపీ వారు అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు.

ఇపుడు ఆయన తన తండ్రి ఎన్టీయార్ పేరుని హెల్త్ వర్శిటీ నుంచి తొలగించారు అన్న దాని మీద గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీటే దానికి నిదర్శనం. అయితే బాలయ్య మీద ఏకంగా వైసీపీ మంత్రులు అంతా మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన్ని వెన్నుపోటుదారునిగా చిత్రీకరించారు. పైగా ఆయన తండ్రికి ద్రోహం చేశారని అన్నారు.

ఇలా ఎవరి మటుకు వారు ఘాటైన పదజాలం వాడారు. దాంతో బాలయ్యను తట్టి లేపినట్లు అయింది అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా టీడీపీకి ఉన్నాయి. దాంతో ఇపుడు తాను డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగాలని అనుకుంటున్నారుట. ఇంతకాలం ఎందుకులే అని ఊరుకున్న బాలయ్య ఇపుడు మాత్రం నందమూరి పౌరుషం ఏంటో చూపించాలనే గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. బాలయ్యకు రాయాలసీమలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయనని సీమలో ఫుల్ గా ఉపయోగించుకోవాలని బాబు ఇప్పటికే నిర్ణయించారు. దానికి బాలయ్య నుంచి మాత్రం ఏమీ తెలియరాలేదు.

కానీ తాజా పరిణామాల నేపధ్యంలో బాలయ్య రెడీ అంటున్నారుట. ఆయన తన సినిమాలను తగ్గించుకుని అయినా ఎన్నికల కోసం ఫుల్ టైం ఇస్తారని అంటున్న్నారు. అలా సీమలో వైసీపీకి కంచుకోటలైన వాటి మీదనే నటసింహం దాడి చేసి మరీ వైసీపీ ఓటమికి భారీ స్కెచ్ వేస్తుంది అని అంటున్నారు.

అంటే వచ్చే ఎన్నికల్లో బాలయ్య సీమలో తిరిగితే ఆయన దూకుడు చేస్తే వైసీపీకి ఇరకాటమే అని అంటున్నారు. ఎన్టీయార్ కాలం నుంచే సీమలో ఆ కుటుంబానికి ఆదరణ బాగా ఉంది. పైగా బాలయ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆయన్ని తమ వాడుగా కూడా వారు భావిస్తారుట. సో బాలయ్యని తట్టి లేపారు. మరి ఆయన పౌరుషాన్ని కూడా చూడాలిగా అని ఫ్యాన్స్ అంటున్నరు అంటే ఈసారి సీమలో దబిడి దిబిడేనా.