కాంగ్రెస్ ను ఒక్కటి చేసిన రేవంత్.. కేసీఆర్ పై ఫైటింగ్ షురూ

Mon Jan 23 2023 15:04:01 GMT+0530 (India Standard Time)

Nagar Kurnool district Bijinepalli Revanth Reddy Senstational Remarks

చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్ ను ఒక్కటి చేసే ప్రయత్నాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ అంటే పడని.. మోసానికి గురైన దళితులు గిరిజనులను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని.. కాంగ్రెస్ ను ఒక్కతాటి పైకి తెస్తానని సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం కుర్చీపై కూర్చోబెట్టే వరకూ విశ్రమించనని సంచలన ప్రకటన చేశారు.దొరకలు బీఆర్ఎస్ ఉందని.. పెట్టుబడిదారులకు బీజేపీ ఉందని.. అయితే దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజనులను బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణకు దళితుడు కాదు దరిద్రుడు సీఎం అయ్యారని విమర్శించారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ను తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

టీపీసీసీ ఇన్ చార్జిగా మాణిక్ రావ్ థాక్రే వచ్చాక పార్టీలో గొడవలన్నీ సమసిపోయాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు పార్టీలో కలిసి పనిచేస్తున్నామని.. కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా కాంగ్రెస్ నేతలంతా పనిచేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని అన్నారు. ప్రాజెక్టులపై ప్రశ్నించిన నాగం జనార్ధన్ రెడ్డి. అతడి వెంట వచ్చిన గిరిజనుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు.

మాణిక్ రావ్ థాక్రే వచ్చాక కోమటిరెడ్డి అలకవీడి గాంధీభవన్ వచ్చి రేవంత్ రెడ్డితో భేటి అయ్యారు. కాంగ్రెస్ లో అసంతృప్తిని తగ్గించారు. ఇప్పుడు నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి నాగర్ కర్నూలులో నినదించారు. చూస్తుంటే అధికారం దిశగా కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి నడిపించేలానే కనిపిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.