Begin typing your search above and press return to search.

అనవసర మత ఘర్షణలతో యువత జీవితం నాశనం

By:  Tupaki Desk   |   13 Sep 2021 6:26 AM GMT
అనవసర మత ఘర్షణలతో యువత జీవితం నాశనం
X
సుప్రీం కోర్టు చీఫ్ జస్డిస్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరుగుతన్న పరిణామాలపై ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మత ఘర్షణల వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుందని, దాని వల్ల ఉపయోగమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రపంచం పాశ్యాత్య సంస్కృతి వైపు పరుగెడుతుంటూ ఇండియా మాత్రం ఇంకా మూఢనమ్మకాల్లోనే మగ్గుతుందన్నారు. ఆనాడు స్వామి వివేకానందన స్ఫూర్తిని ఎవరూ తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందర మానవ వికాసం నిర్మాణమై 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ ఆసక్తికరంగా ప్రసంగించారు.

‘దేశంలో కొన్నిచోట్ల అనవసర మత ఘర్షణలు జరుగుతున్నాయి. మతం అనేదానికి చాలా మందికి అర్థం తెలియనట్లుంది.. స్వామి వివేకానందుసు సూచించిన మతానికి ఇప్పుడు పాటిస్తున్న మతానికి చాలా తేడా ఉంది. ఆనాడు వివేకానందుడు చికాగోలో చేసిన ప్రసంగం గురించి కొందరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మతం అంటే సహనం.. సమానత్వం.. అలాంటి సహనం, సమానత్వానికి ప్రతీక ఇండియా అని వివేకానందుడు చికాగోలో ప్రసంగించారు. కానీ నేటి తరంలో కొందరు మతం అర్థం మారుస్తున్నారు..’ అని అన్నారు.

‘స్వామి వివేకానందుడి ప్రసంగాన్ని ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన బోధనలు మననం చేసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి సమాజం స్పెక్యులరిజానికి వ్యతిరేకంగా వెళ్తోంది. యువత అనవసర ఘర్షణలు పడుతూ తమ జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అర్ధరహితమైన ఆందోళనలతో జాతీయవాదానికి పెను ప్రమాదం ఉంది. సమాజం ఎక్కువగా మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.’ అని అన్నారు.

‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టేందుకు ప్రజలంతా కుల మత విభేదాలు లేకుండా ఒక్కటయ్యారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, బిర్సాముండా లాంటి వారు వివిధ మతాలకు చెందిన వారు. అయినా వారు కలిసి కట్టుగా పోరాడారు. ఆ సమయంలో సమానత్వంతో ఉండడం వల్లే స్వాతంత్ర్యం సాధ్యమైంది. యువత వారిని ఆదర్శంగా తీసుకొని స్వేచ్ఛ, సమానత్వ భావాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అలాగే వారి ఆదర్శాలతో జీవితాన్ని విజయవంతంగా ముందుకెళ్లాలి. బిర్సా ముండా గిరిజన సమాజిక వర్గ యువతను ఏకం చేశారన్నారు. ’

‘ఒకప్పుడు దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. కానీ నేడు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా యువత చదువుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విద్యనభ్యసించడానికి అనేక మార్గాలున్నాయి. చాలా మంది భారతీయులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వివిధ రంగాల్లో ఉన్నత పదవులు పొందుతున్నారు. కేవలం సాంప్రదాయ ఉద్యోగాలు మాత్రమే కాకుండా అంతరిక్షం వరకు వెళ్లేందుకు చాలా మంది ఇండియన్స్ సాహసిస్తున్నారు.

వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలి. విద్యనభ్యసించడానికి నేడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. సౌకర్యాలను వినియోగించుకొని యువత వారికి నచ్చిన రంగంలో అభివృద్ధి చెందాలి. మూఢనమ్మకాల విశ్వాసంలో మగ్గడం వల్ల ఉన్నతంగా ఎదగలేరు. ఉన్నత చదువుల ద్వారానే మంచి వ్యక్తిత్వం వస్తుంది.. దీంతో జీవితం సార్థకమవుతుంది.

దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ప్రధానమైనంది. అలాంటి యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత భావాలను ఏర్పరుచుకోవాలి. సరైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించుకోవడానికి కృషి చేయాలి. అప్పుట జీవితానిక ఓ అర్థం ఉంటుది. స్వామి వివేకానంద చెప్పిన సూచనలు, విలువలను మననం చేసుకొని ఆదర్శంగా తీసుకోవాలి. మంచి వ్యక్తిత్వం మంచి జీవితాన్నిస్తుంది. తద్వారా తమ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ’అని ఎస్వీ రమణ యువతకు సూచించారు. అనవసర మత ఘర్షణలతో యువత జీవితం నాశన: ఎస్వీ రమణ

సుప్రీం కోర్టు చీఫ్ జస్డిస్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరుగుతన్న పరిణామాలపై ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మత ఘర్షణల వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుందని, దాని వల్ల ఉపయోగమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రపంచం పాశ్యాత్య సంస్కృతి వైపు పరుగెడుతుంటూ ఇండియా మాత్రం ఇంకా మూఢనమ్మకాల్లోనే మగ్గుతుందన్నారు. ఆనాడు స్వామి వివేకానందన స్ఫూర్తిని ఎవరూ తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందర మానవ వికాసం నిర్మాణమై 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ ఆసక్తికరంగా ప్రసంగించారు.

‘దేశంలో కొన్నిచోట్ల అనవసర మత ఘర్షణలు జరుగుతున్నాయి. మతం అనేదానికి చాలా మందికి అర్థం తెలియనట్లుంది.. స్వామి వివేకానందుసు సూచించిన మతానికి ఇప్పుడు పాటిస్తున్న మతానికి చాలా తేడా ఉంది. ఆనాడు వివేకానందుడు చికాగోలో చేసిన ప్రసంగం గురించి కొందరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మతం అంటే సహనం.. సమానత్వం.. అలాంటి సహనం, సమానత్వానికి ప్రతీక ఇండియా అని వివేకానందుడు చికాగోలో ప్రసంగించారు. కానీ నేటి తరంలో కొందరు మతం అర్థం మారుస్తున్నారు..’ అని అన్నారు.

‘స్వామి వివేకానందుడి ప్రసంగాన్ని ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన బోధనలు మననం చేసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి సమాజం స్పెక్యులరిజానికి వ్యతిరేకంగా వెళ్తోంది. యువత అనవసర ఘర్షణలు పడుతూ తమ జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అర్ధరహితమైన ఆందోళనలతో జాతీయవాదానికి పెను ప్రమాదం ఉంది. సమాజం ఎక్కువగా మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.’ అని అన్నారు.

‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టేందుకు ప్రజలంతా కుల మత విభేదాలు లేకుండా ఒక్కటయ్యారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, బిర్సాముండా లాంటి వారు వివిధ మతాలకు చెందిన వారు. అయినా వారు కలిసి కట్టుగా పోరాడారు. ఆ సమయంలో సమానత్వంతో ఉండడం వల్లే స్వాతంత్ర్యం సాధ్యమైంది. యువత వారిని ఆదర్శంగా తీసుకొని స్వేచ్ఛ, సమానత్వ భావాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అలాగే వారి ఆదర్శాలతో జీవితాన్ని విజయవంతంగా ముందుకెళ్లాలి. బిర్సా ముండా గిరిజన సమాజిక వర్గ యువతను ఏకం చేశారన్నారు. ’

‘ఒకప్పుడు దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. కానీ నేడు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా యువత చదువుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విద్యనభ్యసించడానికి అనేక మార్గాలున్నాయి. చాలా మంది భారతీయులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వివిధ రంగాల్లో ఉన్నత పదవులు పొందుతున్నారు. కేవలం సాంప్రదాయ ఉద్యోగాలు మాత్రమే కాకుండా అంతరిక్షం వరకు వెళ్లేందుకు చాలా మంది ఇండియన్స్ సాహసిస్తున్నారు.

వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలి. విద్యనభ్యసించడానికి నేడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. సౌకర్యాలను వినియోగించుకొని యువత వారికి నచ్చిన రంగంలో అభివృద్ధి చెందాలి. మూఢనమ్మకాల విశ్వాసంలో మగ్గడం వల్ల ఉన్నతంగా ఎదగలేరు. ఉన్నత చదువుల ద్వారానే మంచి వ్యక్తిత్వం వస్తుంది.. దీంతో జీవితం సార్థకమవుతుంది.

దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ప్రధానమైనంది. అలాంటి యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత భావాలను ఏర్పరుచుకోవాలి. సరైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించుకోవడానికి కృషి చేయాలి. అప్పుట జీవితానిక ఓ అర్థం ఉంటుది. స్వామి వివేకానంద చెప్పిన సూచనలు, విలువలను మననం చేసుకొని ఆదర్శంగా తీసుకోవాలి. మంచి వ్యక్తిత్వం మంచి జీవితాన్నిస్తుంది. తద్వారా తమ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ’అని ఎస్వీ రమణ యువతకు సూచించారు.