Begin typing your search above and press return to search.

నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా ఎన్టీవీ... రికార్డ్ రేటింగ్స్!

By:  Tupaki Desk   |   8 Jun 2023 2:00 PM GMT
నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా ఎన్టీవీ... రికార్డ్ రేటింగ్స్!
X
తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌ గా తన సత్తాను చాటుతోంది ఎన్టీవీ. 24x7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు మెరుపు వేగంతో మెరుగైన వార్తలు అందిస్తూ ప్రజాపక్షపాతిగా తమ వైఖరిని ప్రదర్శిస్తూ... స్పష్టతతో కూడిన వార్తలు ప్రసారం చేస్తూ ముందుకు దూసుకుపోయింది. తప్పును ఖండించే విషయంలోనూ, ఒప్పును అభినందించే విషయంలోనూ "ప్రతి క్షణం-ప్రజా హితం" ట్యాగ్ లైన్ కు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తుంది.

ఛానెల్ ప్రారంభించిన నాటి నుంచే ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందుతూ ఊహించని రీతిలో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా... ఇంతింతై వటుడింతై అన్నట్లు తాజాగా భారీ రేటింగ్స్‌ ను సొంతం చేసుకుంది. ఫలితంగా అందనంత ఎత్తుకు చేరిపోయింది. తుమ్మల నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ 24గంటల తెలుగు న్యూస్ ఛానల్.. "ఆల్ వేస్ నెంబర్ 1" అనే ఐడెంటిటీని కాపాడుకుంటూ వస్తుంది.

గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయివరకూ తన కవరేజీ స్థాయిని విస్తరించుకోవడంలో సక్సెస్ అయిన ఎన్టీవీ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆద‌ర‌ణ పొందుతూ వ‌చ్చింది. నమ్మకమైన, ఖచ్చితమైన వార్తలకు కేరాఫ్ గా నిలిస్తుంది. “తెలుగు వార్తలంటే ఎన్టీవీ - ఎన్టీవీ అంటే తెలుగు వార్త” అనే స్థాయిలో ప్రజాధరణ పొందడం అంత సులువైన విషయం కాదు. దీంతో... యాజమాన్యం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు సిబ్బంది.

మెట్రోపాలిటన్ సిటీల నుంచి మారుమూల గ్రామాల వరకూ... వార్త ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా... కచ్చితమైన సమాచారాన్ని వీలైనంత వేగంగా అందించడమే ప్రాధమిక సూత్రాలుగా ఎంచుకున్న ఎన్టీవీ... ప్రతిసారీ దాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. వార్తలంటే ఛానళ్ల అధినేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను జనంపై రుద్దడం కాదని బలంగా నమ్మే ఈ ఛానల్ యాజమాన్యం... ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉండటం ఈ సక్సెస్ కు కారణం అని చెప్పకతప్పని పరిస్థితి.

ఈ క్రమంలో... వారి కష్టాన్ని, కమిట్ మెంట్ నీ ప్రతిబింబిస్తున్నాయి తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ వివరాలు. అవును... తాజాగా విడుదలైన బార్క్ రేటింగ్స్ లో 8% వృద్ధిని సాధిస్తూ… 71.9 టీఆర్పీల‌తో ఎన్టీవీ ఫస్ట్ ప్లేస్‌ పరంపరను కొనసాగిస్తోంది. తాము ఎంచుకున్న ట్యాగ్ లైన్ ను వదలకుండా.. బెద‌ర‌కుండా.. బెదిరించ‌కుండా.. ఆత్మస్తుతి పరనిందలకు తావులేకుండా సెలెంట్‌ గా దూసుకుపోతోంది.

దీంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తుండగా... సిబ్బంది పనితీరును అభినందిస్తూ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తుంది! ఫలితంగా... యావత్ తెలుగు ప్రజల నుంచి అభినందనలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి!