Begin typing your search above and press return to search.

ఇంటరెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ : 1978 లో ఎన్టీయార్ పాలిటికల్ ఎంట్రీ...?

By:  Tupaki Desk   |   28 May 2023 12:25 PM GMT
ఇంటరెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ : 1978 లో ఎన్టీయార్  పాలిటికల్ ఎంట్రీ...?
X
వెండి తెర వేలుపు ఎన్టీయార్ . ఆయన తెలుగు జాతికి ప్రాతస్మరణీయుడు. ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలు చాలు తెలుగు ప్రజల కు అవి తారక మంత్రాలు. ఎన్టీయార్ పేరు తలంచుకుంటే ఎంతటి బలహీనుల కు అయినా ఆత్మ విశ్వాసం ఎవరెస్ట్ శిఖరమంత పెరుగుతుంది. ఆయన డిక్షనరీ లో అసాధ్యం అంటూ లేదు. అన్నీ సుసాధ్యాలే.

ఎన్టీయార్ తలచుకున్నారు అంటే చేసేయడమే. ఎన్టీయార్ సినీ రంగంలో ఎన్నో విలక్షణ మైన పాత్రల ను సలక్షణంగా చేసి చూపించారు. ఆ పాత్రలు ఈ రోజుకీ టచ్ చేయడానికి ఎవరికీ డేరింగ్ లేదు. మళ్ళీ పుడితే ఎన్టీయార్
మాత్రమే చేయాలి అన్నట్లుగా వాటిని వెండి తెర కళాఖండాలుగా తీర్చిదిద్దారు.

ఎన్టీయార్ సినిమాలు కూడా ఎంతో చైతన్యవంతంగా ఉండేవి. సమకాలీన అంశాలను ఆయన కధా వస్తువుగా తీసుకుని జనాల కు పవర్ ఫుల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేవారు. అలా వరకట్నం దురాచారం మీద సినిమాలు తీశారు. కుటుంబ విలువల మీద ఎన్నో సినిమాలు తీశారు. కుటుంబ నియంత్రణ కు వ్యతిరేకం అని అంతా అన్నా తాతమ్మ కలలో అద్భుతమైన సందేశం ఉంటుంది.

ఉమ్మడి ఏపీ ని నిండు పాలకుండ అని విభజించవద్దు అంటూ తల్లాపెళ్లాం సినిమా లో ఒక పాట పెట్టి మరీ తన భావాలను ఆనాడు ధైర్యంగా చెప్పారు. ఇదంతా ఎందుకు అంటే ఎన్టీయార్ కి ఏమి తెలుసు రాజకీయాలు అని తరువాత రోజుల్లో వెటకారం చేసిన వారికి ఆయనకు ఉన్న సామాజిక స్పృహ ఎంత ఉంది అన్నది ఒక్క సారి గుర్తు చేసుకోవడమే.

ఎన్టీయార్ నిజానికి మద్రాస్ లో ఉన్నా న్యూస్ పేపర్స్ అదే పనిగా చదవకపోయినా ఆయనకు తెలుగు రాజకీయలా మీద ఆనాటి ఢిల్లీ రాజకీయాల మీద ఎంతో అవగాహన ఉండేది. ఇక 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దాన్ని ఎన్టీయార్ తన యమగోల సినిమా లో సెటైర్లు వేస్తూ తప్పు పట్టారు.

ఇక ఆ తరువాత 1978లో ఉమ్మడి ఎపీకి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో దేశమంతా ఇందిరా గాంధీ వ్యతిరేకత ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ గా రెడ్డి కాంగ్రెస్ గా రెండు గా చీలింది. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు ఎన్టీయార్ ని చెన్నై లో కలసి రాజకీయాల్లోకి రావాలని కోరారు ఇదే తగిన సమయం అని కూడా చెప్పారు.

దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పార్టీని ఏర్పాటు చేయాలని కోరారు. దానికి ఎన్టీయార్ సున్నితంగా తిరస్కరించారు. అప్పటికి ఎన్టీయార్ దానవీర శూర కర్ణ. అడవిరాముడు,యమగోల వంటి సూపర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో టాప్ లెవెల్ లో ఉన్నారు. ఆయన వారికి చెప్పిందేంటి అంటే తనకు రాజకీయాలు అంటే ఆసక్తి ఉందని, కానీ తనకు సినీ రంగంలో ఉన్న కమిట్ మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని అర వై ఏళ్ల కు రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను అని చెప్పారని ఫ్లాష్ బ్యాక్ కధనాలు ఉన్నాయి.

అలా అన్న మాట ప్రకారం అన్న గారు 1982లో తన అర వై ఏళ్ళకు రెండు నెలల ముందే అంటే అదే ఏడాది మార్చి 29న తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆ పార్టీ ఎంతటి రాజకీయ అద్భుతం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీయార్ అప్పటి దాకా సాగిన ఢిల్లీ రాజకీయాల ను కేంద్రీకృత రాజకీయ విధానాల ను టీడీపీ ఏర్పాటు తో గట్టిగా ప్రశ్నించారు. కేంద్రం మిధ్య అని చాలా సాహసంగా ఆయన అనగలిగారు ఇందిరా గాంధీ కి ఎదురులేదు అనుకున్న రోజుల్లో ఆమెను ఢీ కొట్టి తన రాజకీయాన్ని కొనసాగించారు.

అదే ఎన్టీయార్ 1978లో పార్టీ పెడితే ఏమయ్యేది అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో అపుడు జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ ల మధ్యన త్రిముఖ పోరు సాగింది. ఎన్టీయార్ 1983లో చూస్తే కాంగ్రెస్ ని డైరెక్ట్ గా ఢీ కొట్టి మట్టి కరిపించారు. సో ఎన్టీయార్ ముందు చూపు ఆయన రాజకీయ అవగాహనకు ఇదే మచ్చుతునక. కాంగ్రెస్ ని సెమీ ఫైనల్స్ లో ఎదుర్కోకుండా ఫైనల్స్ కి రానిచ్చి గద్దె దించిన బహు మొనగాడు రామారావు అని చెప్పాల్సి ఉంటుంది.