Begin typing your search above and press return to search.

టైం స్క్వేర్ వద్ద అన్నగారి ముద్ర.. ఆ భారీ మొత్తాన్ని పే చేసిందెవరంటే?

By:  Tupaki Desk   |   29 May 2023 12:09 PM GMT
టైం స్క్వేర్ వద్ద అన్నగారి ముద్ర.. ఆ భారీ మొత్తాన్ని పే చేసిందెవరంటే?
X
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్ని భారీగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బొమ్మతోరాజకీయాలు చేసే టీడీపీ మాత్రమే శతజయంతి ఉత్సవాలకు ఖర్చు చేయట్లేదు. ఎన్టీఆర్ కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ వరకు పరిమితం కాకుండా.. ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు వ్యక్తిగతంగా తమకున్న అభిమానంతో కార్యక్రమాల్ని చేపట్టటం కనిపిస్తోంది. ఈ తీరు ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇష్టాలకు తగ్గట్లు..ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాల్ని నిర్వహిస్తారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద ఎన్టీఆర్ ఫోటోల్ని ప్రదర్శించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున తెలుగువారు చేరుకొని అన్నగారి ఫోటోలు భారీ ఎత్తున ప్రదర్శిస్తుంటే.. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. యుగపురుషుడు ఎన్టీఆర్ కు చెందిన పలు చిత్రాల్ని ప్రదర్శించారు. ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమెరికా కాలమానం ప్రకారం మే 27 అర్థరాత్రి నుంచి మే 28 అర్థరాత్రి వరకు అంటే 24 గంటల పాటు ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల పాటు ఎన్టీఆర్ చిత్రాల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులుపెద్ద ఎత్తున చేరుకొని.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. టైం స్క్వేర్ లో ప్రదర్శించే చిత్రాలు 200 అడుగుల ఎత్తు.. 36 అడుగుల వెడల్పుతో ప్రదర్శితమవుతాయి.

సినిమాల నుంచి రాజకీయాల వరకు పలు చిత్రాల్ని ప్రదర్శించారు. మరి.. దీనికోసం ఎంత ఖర్చు పెట్టారు? దాన్ని ఎవరు చెల్లింపులు జరిపారు? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టైం స్క్వేర్ వద్ద ఎన్టీఆర్ చిత్రాల ప్రదర్శనకు 2.4 లక్షల డాలర్లు ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.2కోట్లు. ఈ మొత్తాన్ని ఒక ఎన్నారై సొంతంగా భరించినట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి.. ఎన్టీఆర్ అభిమానులకు ఉన్న ఆర్థిక బలం ఎంతన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. అమెరికాలోని తెలుగు సమూహం ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమవుతుందని చెప్పాలి. ఏమైనా.. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఇంత భారీగా ఖర్చు చేయటం.. అది ఒక్కరే బాధ్యత తీసుకోవటం చూస్తే.. ఇలాంటివి ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయని చెప్పక తప్పదు.