Begin typing your search above and press return to search.

సాయాన్ని మర్చిపోని ఎన్ఆర్ఐ కుటుంబం.. 12 ఏళ్ల తర్వాత..!

By:  Tupaki Desk   |   13 Jan 2022 11:30 PM GMT
సాయాన్ని మర్చిపోని ఎన్ఆర్ఐ కుటుంబం.. 12 ఏళ్ల తర్వాత..!
X
ఒక వ్యక్తికి సాయం చేస్తే అదే మనకి సరైన సమయంలో తిరిగి చేతికంది వస్తుందని చాలా మంది పెద్దలు చెప్తుంటారు. ఈ భావనతోనే పది మందికి సాయం చేస్తుంటారు. తాము చేసిన సాయం కనీసం తమ పిల్లలకైనా కలిసి రావాలని అనుకుంటారు . ఇటీవల కాలంలో అటువంటి సాయం పొందిన వారు చేసిన వారిని ఇట్టే మర్చిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఓ ఎన్నారై కుటుంబం ఓ వ్యక్తి కోసం సుమారు 12 ఏళ్లకు పైగా గాలించింది. పుష్కర కాలం కిందట తమకు చేసిన సాయాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ... పన్నెండేళ్లుగా ఆ రుణ భారాన్ని వాళ్ళు మోస్తూ వచ్చారు. వాస్తవానికి ఆ ఎన్ఆర్ఐ ది సంపన్న కుటుంబమైనా కానీ.. సరైన సమయానికి ఆయన చేతిలో రూపాయి లేకపోవడం ఇందుకు కారణం. అలా డబ్బులు లేను సమయంలో పిల్లల అడిగిన కోరికను తీర్చారు. ఆ సమయంలో ఆయనకు అవసరం తీర్చిన ఓ వ్యక్తి రుణం తీర్చుకునేందుకు 12 ఏళ్లు పట్టింది.

అసలేం జరిగిందంటే కాకినాడ బీచ్ లో మోహన్ నేమాని అనే వ్యక్తి అతని కుటుంబం సరదాగా గడుపుతున్నారు. ఈ సమయంలోనే మోహన్ పిల్లలిద్దరూ తమకు తినడానికి ఏమైనా కావాలని అడిగారు. వెంటనే దగ్గరలో ఉన్న ఓ వ్యక్తి శనక్కాయలు అమ్మడం చూసి.. అతని దగ్గర ఉండే రెండు ప్యాకెట్లను తీసుకుని పిల్లలకు ఇచ్చారు. తీరా డబ్బులు ఇద్దామని చూస్తే పర్సు లేదు. వాస్తవానికి మోహన్ ది సంపన్న కుటుంబం. కానీ బీచ్ కు వస్తున్న సమయంలో అతను తన పర్స్ ని తెచ్చుకోవడం మర్చిపోయాడు. అయితే ఇదే సమయంలో వారికి శనక్కాయలు అమ్మిన వ్యక్తి ఓ మాట అన్నారు. 'శనక్కాయలు తినండి పిల్లలే కదా..? మీ పిల్లలు అయితే ఒకటి..? మా పిల్లలు అయితే ఒకటా..? పర్లేదు లెండి' అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వ్యక్తి పేరే పెద సత్తయ్య. అతని గొప్ప మనసు ని చూసిన మోహన్ దానినే మనసులో పెట్టుకున్నారు. తర్వాత వచ్చే అయినా అతనికి ఏదో ఒక రూపంలో సాయం చేయాలని అనుకున్నారు. అలా ఇంటికి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత మోహన్ కుటుంబం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. అయితే ఏడాదికి ఓ సారి సొంతూరైన కాకినాడకి వచ్చేవారు. ఈ క్రమంలోనే తమకు సాయం చేసిన సత్తయ్య కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికేవారు. వచ్చిన ప్రతిసారి బీచ్ కు సమీపంలో ఉన్న గ్రామాల్లో కూడా అతని గురించి ఆరా తీసేవారు. అయితే గత పదకొండేళ్లలో వారి వెతుకులాటలో ఎప్పుడూ వారికి సత్తయ్య జాడ లభించలేదు. దీంతో వాళ్ళు తిరిగి అమెరికా వెళ్లే ప్రతిసారి అతని రుణం తీర్చుకోలేము పోయామని భావనతో వెళ్లేవారు.

అయితే ఈసారి కూడా అలానే కాకినాడ కు వచ్చిన మోహన్ కుటుంబం ప్రతిసారి లాగా సత్తయ్య గురించి వెతికేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... మోహన్ కి చాలా సన్నిహితులు. దీంతో ఎమ్మెల్యే చేత సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ ను పెట్టించారు. సత్తయ్య వారికి సాయం చేసిన నాటి ఫోటో ను తీసుకున్న మోహన్... దానిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫేస్బుక్ లో పెట్టించి అతని ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని కింద వివరణ ఇచ్చారు. దానితో పాటు ఒక ఫోన్ నెంబర్లు కూడా జతచేశారు చంద్రశేఖర్రెడ్డి. అయితే ఇది చూసిన ఓ వ్యక్తి సత్తయ్య ను గుర్తుపట్టి ఎమ్మెల్యే కి సమాచారం అందించారు. చివరకు ఈ విషయం తెలుసుకున్న మోహన్ కుటుంబం.. సత్తయ్య కుటుంబాన్ని కలిసి 12 ఏళ్లుగా తాము మోస్తున్నా రుణ భారాన్ని పాతిక వేలు ఇచ్చి తీర్చుకుంది.

అయితే మోహన్ ఇచ్చినా సాయాన్ని తీసుకునేందుకు సత్తయ్య ప్రాణాలతో లేరు దీంతో అతని భార్య అయినా లింగమ్మకు ఆ మొత్తాన్ని అందజేసింది మోహన్ కుటుంబం. అప్పుల బాధతో సత్తయ్య మరణించారని తెలుసుకున్నా మోహన్ ఎంతో కలత చెందారు దీంతో తమకు తోచిన సాయం గా పాతిక వేల ను అందజేస్తున్నట్లు తెలిపారు. 12 ఏళ్ళు కిందట జరిగిన దానిని గుర్తు పెట్టుకుని.. తమకు సాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు లింగమ్మ.