Begin typing your search above and press return to search.

దీన్ని ముట్టుకుంటే రోగాలు మాయమంటా ?

By:  Tupaki Desk   |   8 Nov 2019 12:47 PM GMT
దీన్ని ముట్టుకుంటే రోగాలు మాయమంటా ?
X
మీకు వచ్చిన జబ్బుకి మందులు లేవు అని చెప్తున్నారా ..లక్షలకి లక్షలు డబ్బులు పోస్తూన్నా కూడా మీకు వచ్చిన జబ్బు నయం కావడం లేదు అని బాధపడుతున్నారా ..ఒకటి కాదు రెండు కాదు ..దేశంలోని ప్రముఖ హాస్పిటల్స్ అన్ని తిరిగినా మీకు ఆరోగ్యం బాగుండటం లేదా అయితే మీరు ఒకసారి మధ్యప్రదేశ్‌ కి వెళ్లాల్సిందే. అదేంటి దేశం మొత్తం తిరిగాం అని చెప్తున్నా, మళ్ళీ మధ్యప్రదేశ్‌ అంటారు అని కోపగించుకుంటున్నారా.. మధ్యప్రదేశ్‌ కి మిమ్మల్ని వెళ్ళమన్నది హాస్పిటల్ కి కాదు .. ఒక చెట్టు దగ్గరికి. అవును మీకు ఎటువంటి జబ్బు ఉన్నా కూడా ఆ చెట్టుని ఒక్కసారి తాకితే చాలు ..క్షణాల వ్యవధిలో మీకున్న జబ్బు తగ్గిపోతుందట..? ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ..రోగాలని నయం చేసే ఆ అద్భుతమైన చెట్టు .. మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది.

ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని, ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో రోజూ వేల మంది అక్కడికి వెళ్తున్నారు. స్థానికంగా ఉండే రూప్ సింగ్ ఠాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు మహిమల గురించి అందరికీ తెలిసింది. కుంటుతూ నడిచే నేను.. ఓ రోజు పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాను. తర్వాత నాలో ఏదో మార్పును వచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకున్నాననిపించింది. ఆరోగ్యం మెరుగు కావడంతో.. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని ఆ రైతు మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో.. అక్కడికి పేషెంట్ల తాకిడి పెరిగింది. హాస్పిటల్స్ ని వదిలి మహిమలున్న ఆ చెట్టు వద్దకి బారులు తీరుతున్నారు.

ఆ చెట్టును తాకడం ద్వారా తనకు రోగం తగ్గిపోయిందని ఓ పేషెంట్ కూడా చెప్పడంతో.. రోజుకి లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం అడవి బాట పట్టి ..ఆ చెట్టుని తాకి వస్తున్నారు. కానీ , ఆలా చెప్పిన కొన్ని గంటల్లోనే అతడు చనిపోయాడు. ఆ చెట్టుకి నిజంగానే మహిమలు ఉన్నాయో ..లేవో తెలియదు కానీ , ఆ చెట్టు పుణ్యమా అని స్థానికులు మాత్రం బాగా లాభపడుతున్నారు. అక్కడికి వచ్చే భక్తులకి మినరల్ వాటర్, స్నాక్స్, కొబ్బరి బోండాలను అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.తమ వ్యాపారం కోసమే స్థానికులు ఆ చెట్టుకి అద్భుత శక్తులు ఉన్నట్టు ప్రచారం చేసారని కొంతమంది తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.