Begin typing your search above and press return to search.

విషాదం : రాత్రి తల్లి, ఉదయాన్నే కొడుకు మృతి

By:  Tupaki Desk   |   13 Aug 2020 10:10 AM GMT
విషాదం : రాత్రి తల్లి, ఉదయాన్నే కొడుకు మృతి
X
తెలంగాణ లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సామాన్యుల నుండి ప్రముఖులు , ప్రజా ప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. అలాగే చాలామంది కరోనాతో మృత్యువాతపడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ ఖేడ్ లో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ దెబ్బకి రాత్రి తల్లి , ఉదయాన్నే కొడుకు కన్నుమూశారు.

ఈ ఘటన పై పూర్తివివరాలు చూస్తే ... సంగారెడ్డి జిల్లాలోని చల్లగిద్ద తండాకు చెందిన ఓ కుటుంబం నారాయణ ఖేడ్‌ లో జీవనం కొనసాగిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు కొడుకులు, కోడళ్లతో పాటు ఇంటి పెద్ద మహిళకు మొత్తం ఐదుగురు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరికి గత నాలుగు రోజుల క్రితం కరోనా నిర్దారణ అయింది. అయితే వీరు ఆస్పత్రికి వెళ్లుండా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే సాయంత్రం వరకు బాగానే ఉన్న తల్లి రాత్రి ఆకస్మికంగా మృతి చెందింది. ఉదయం కొడుకు కూడా మృతి చెందాడు. దీనితో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇదిలా ఉండగా మృత దేహాలను నారాయణఖేడ్ నుంచి ఇక్కడికి తరలించవద్దని చల్లగిద్ద తండా వాసులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే , తెలంగాణ హైకోర్టు .. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్స అంశంలో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది.