Begin typing your search above and press return to search.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌ స్టర్ రవి పూజారి అరెస్ట్... బెంగుళూరు తరలింపు

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:28 AM GMT
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌ స్టర్ రవి పూజారి అరెస్ట్... బెంగుళూరు తరలింపు
X
ఇండియాలో అనేక దోపిడీలు, హత్యలు, బెదిరింపులు సహా అనేక నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌ స్టర్ రవి పూజారిని దక్షిణాఫ్రికా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ దేశం విడిచి పారిపోయి 15 ఏళ్లు అవుతుంది. తాజాగా ఇతన్ని పట్టుకున్న కర్ణాటక కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారులతో సహా అధికారుల బృందం సోమవారం బెంగళూరు కి తీసుకువచ్చారు. ఎన్ఐఏ, సీబీఐ, రా విభాగాలు రవిని విచారించనున్నాయి. మొదట్లో ఈ రవి పూజారి ..చోటా రాజన్ దగ్గర పని చేసాడు అని , ఆ తరువాత అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం కూడా పని చేసినట్లు గా సమాచారం. ఆ తరువాత వారి నుండి విడిపోయి తానే ఒక గ్యాంగ్ మెయింటేన్ చేస్తున్నాడు.

ఆ తరువాత కొన్ని రోజులకి భారత్‌ నుంచి పారిపోయి సెనెగల్ చేరిన రవి పూజారి తన పేరును ఆంటోనీ ఫెర్నాండెజ్‌గా మార్చుకున్నాడు. అనంతరం పాస్‌పోర్ట్ సంపాదించి కుటుంబాన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేశాడు. ఈ క్రమంలోనే గత ఏడాది సెనెగల్ అధికారులు ఈ డాన్‌ ను అరెస్టు చేశారు.. భారత పోలీసులు అతనిని పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించారు, కాని స్థానిక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో అతను పారిపోయాడు. దాంతో అతన్ని పట్టుకోవడం లో ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ ఎట్టకేలకు ఆ దేశంతో మాట్లాడి అతన్ని అరెస్ట్ చేయించడం తో పని పూర్తి చేసింది.

దక్షిణాఫ్రికాలో కూడా పూజారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీకి పాల్పడ్డాడు. దాంతో అతన్ని ఇటీవల సెనెగల్ నుంచి బహిష్కరించారు. అంతకుముందు భారత్ లో కూడా హత్య మరియు దోపిడీతో సహా 200 కి పైగా ఘోరమైన నేరాలకు రవి పూజారి పాల్పడ్డాడు. అతను ఇంతకాలం దక్షిణాఫ్రికాలోని మారుమూల గ్రామంలో బుర్కినా ఫాసో పాస్‌ పోర్ట్ హోల్డర్ అయిన ఆంథోనీ ఫెర్నాండెజ్ యొక్క తప్పుడు గుర్తింపుతో తలదాచుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యం లో సెనెగల్ అధికారులు రవిని అరెస్ట్ చేసాయి.

సెనెగల్‌లో అతన్ని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న అదనపు పోలీసు జనరల్ అమర్ కుమార్ పాండే, బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ సహా పోలీసు అధికారుల బృందం అతన్ని తీసుకురావడానికి సెనెగల్ వెళ్లింది. అతన్నిభారత్ కి అప్పగించడానికి సెనెగల్ సుప్రీం కోర్టు ఒప్పుకోవడంతో ఈ బృందం గాంగ్ స్టర్ ను ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో 2020 ఫిబ్రవరి 22 న బెంగళూరుకు తీసుకువచ్చింది. ఈయన పై బాలీవుడ్, శాండల్‌ వుడ్ సినిమా స్టార్లను, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను బెదిరించి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.