Begin typing your search above and press return to search.

షాక్.. వైరస్ టెస్టింగ్‌ కిట్‌ను ఎత్తుకెళ్లిన కోతి !

By:  Tupaki Desk   |   29 May 2020 11:50 AM GMT
షాక్.. వైరస్ టెస్టింగ్‌ కిట్‌ను ఎత్తుకెళ్లిన కోతి !
X
కోతుల గుంపు చేసిన ఓ చిలిపి పనితో ఇప్పుడు మీరట్ వాసులు మహమ్మారి భయంతో వణికిపోతున్నారు. సాధారణంగా కోతులు ఏది పడితే అది ఎత్తుకెళ్తుంటాయి. అది కూడా తినే వస్తువులా కనిపించిందో ఏమో కానీ, ఓ కోతుల గుంపు క‌రోనా అనుమానితుల న‌మూనాల‌ను ఎత్తుకెళ్లింది. ఈ వింత‌ ఘ‌ట‌న ఉత్త‌రప్ర‌దేశ్ ‌లోని మీర‌ట్‌ లో చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తివివరాలు చూస్తే .. మీర‌ట్‌ మెడికల్‌ కాలేజీలో ముగ్గురు వైరస్ అనుమానితుల‌కు వైద్యులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీటిని ప‌రీక్షించేందుకు శుక్ర‌వారం ఓ ల్యాబ్ టెక్నీషియ‌న్ ఈ టెస్ట్ సాంపిల్స్ ‌ను మోసుకు వెళుతుండ‌గా ఒక్కసారిగా కోతులు అత‌నిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. అత‌ని ద‌గ్గ‌ర ఉన్న సాంపిల్స్‌ను ఎత్తుకెళ్లాయి.

ఆ గుంపులోని ఓ కోతి వైరస్ టెస్టింగ్ కిట్‌ ను న‌మిలివేస్తూ క‌నిపించింద‌ని గ్రామ‌స్థులు చెప్తున్నారు. దీంతో ఆ ప్రాంత‌వాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. టెస్టింగ్ కిట్ల‌లో వైర‌స్‌ ఉండొచ్చేమోన‌ని, వాటిని వాన‌రాలు ఎక్క‌డ‌ త‌మ ఇళ్ల‌పై విసిరేస్తాయోన‌ని ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నారు. మ‌రోవైపు వైద్యులు వైరస్ అనుమానితుల ద‌గ్గ‌ర నుంచి మ‌రోసారి నమూనాల‌ను సేక‌రించి ల్యాబ్ ‌కు పంపారు.