Begin typing your search above and press return to search.

గుజరాత్ ఎన్నికల ముందు తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్న మోడీ

By:  Tupaki Desk   |   5 Dec 2022 2:30 AM GMT
గుజరాత్ ఎన్నికల ముందు తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్న మోడీ
X
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఓటు వేయనున్నారు. ప్రధాని మోదీ ఈరోజు అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ సంవత్సరం 99 ఏళ్లు పూర్తి చేసుకున్న తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

గాంధీనగర్ లోని బీజేపీ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు దాదాపు 45 నిమిషాల పాటు తన మాతృమూర్తితోనే ముచ్చటిస్తూ ఆమెతోనే సమయం గడిపారు. ఇంట్లో సోఫోలో కూర్చొని తల్లితో మోడీ ముచ్చటిస్తున్నట్టు ఫొటోల్లో చూడొచ్చు.

రేపు, గుజరాత్‌లోని 14 మధ్య , ఉత్తర జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) వీటిలో 51, కాంగ్రెస్ 39, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలు గెలుచుకున్నారు.

అహ్మదాబాద్‌లో ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ ఓటు వేయనున్నారు. హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు.

ప్రధాని మోదీ చివరిసారిగా జూన్‌లో తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా ఆమెను సందర్శించారు.

గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడత పోలింగ్ జరగ్గా 63.31 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 5న మిగిలిన 93 స్తానాలకు రెండో దశ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.