Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ లేకుండా లేఖ‌ల రాజ‌కీయ‌మెందుకు మోడీ జీ!!

By:  Tupaki Desk   |   19 April 2021 2:48 AM GMT
వ్యాక్సిన్ లేకుండా లేఖ‌ల రాజ‌కీయ‌మెందుకు మోడీ జీ!!
X
దేశంలో క‌రోనా రెండోద‌శ‌ వ్యాప్తి.. అత్యంత వేగంగా ఉన్న విష‌యం తెలిసిందే. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు.. క‌రోనా రోగులు పెరుగుతున్నారు. పాజిటివ్ కేసులు.. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్నాయి. ఈ నేప ‌థ్యంలో వీటిని అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు.. భారీ ఎత్తున పెరుగుతున్నాయి. దీనికి తోడు మ‌ర‌ణా లు కూడా పెరుగుతున్నాయి. ఆస్ప‌త్రుల్లో బెడ్లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇలాంటి మౌలిక విష‌యాల‌పై దృష్టి పెట్టి ప‌రిస్థితిని అదుపు చేయాల్సిన కేంద్రంలోని న‌రేం ద్ర మోడీ ప్ర‌భుత్వం.. చేష్ట‌లుడిగి చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా క‌ట్ట‌డికి ప‌టిష్ట‌మైన వ్యాక్సిన్ తీసుకువ‌చ్చామ‌ని.. మోడీ ప్ర‌భుత్వం ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అంతే కాదు.. మ‌న‌దేశం నుంచి ఇత‌ర దేశాల‌కు ఉదారంగా వ్యాక్సిన్ ఎగుమ‌తి కూడా చేశారు. కానీ, ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా క‌రోనా ప‌రిస్థితి తీవ్ర‌మైంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు.

అయితే.. ఒక‌వైపు క‌రోనా రోగుల‌కు అందించే ఆక్సిజ‌న్‌, మ‌రోవైపు వ్యాక్సిన్‌లు కూడా నిండుకున్నాయి. ఎక్క‌డా ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్యం అందించే వెసులుబాటు లేకుండా పోయింది. ఇప్ప‌టికీ.. ఇంకా వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే.. మ‌రోవైపు.. కేంద్ర ఆరోగ్య శాఖ‌.. రాష్ట్రాల‌కు లేఖ‌లు రాసింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్రాలు విధిస్తున్న లాక్‌డౌన్లు, కర్ఫ్యూల ప్రభావం దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రైవ్‌‌పై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అర్హులైన వారు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లకు చేరుకునేలా, ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రతికూల ప్రభావం పడనీయరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. అదేవిధంగా, డెడికేటెడ్ కోవిడ్ 19 ఆసుపత్రులుగా గుర్తించిన సీవీసీలు నిరాటంకంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ సేవలు అందించేలా చూడాలని పేర్కొంది. ఆయా ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ సర్వీసులకు ప్రత్యేక బిల్డింగ్, లేదా బ్లాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే.. అస‌లు వ్యాక్సిన్ కొర‌త వెంటాడుతున్న స‌మ‌యంలో కేంద్ర రాస్తున్న లేఖ‌లు హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.