Begin typing your search above and press return to search.

మోడీ మాస్టారి కొత్త టార్గెట్.. లక్ష కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్డు.. లాభం ఇదే

By:  Tupaki Desk   |   12 July 2020 1:30 AM GMT
మోడీ మాస్టారి కొత్త టార్గెట్.. లక్ష కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్డు.. లాభం ఇదే
X
కేంద్రంలోని మోడీ సర్కారు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వందలాది కోట్ల రూపాయిల్ని ఆదా చేయటంతో పాటు.. ప్లాస్టిక్ వ్యర్థాల్ని సమర్థంగా వినియోగించేందుకు వీలుగా భారీ ప్లానింగ్ చేస్తోంది. ఎందుకు పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాల్ని వినియోగించి రోడ్లు వేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లక్ష కిలోమీటర్ల రోడ్లును పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే వేసిన లక్ష కిలోమీటర్ల రోడ్లకు అదనంగా మరో లక్ష కిలోమీటర్ల రోడ్లను వేయనున్నారు.

రీసైక్లింగ్ చేసేందుకు ఏ మాత్రం వినియోగించే ప్లాస్టిక్ ను ఉపయోగించి.. ఈ రోడ్లను నిర్మించాలని భావిస్తున్నారు. సాధారణంగా ఒక కిలోమీటరు రోడ్డు వేసేందుకు పది టన్నుల తారు అవసరమవుతుంది. తొమ్మిది టన్నుల తారు.. ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్థాల్ని వినియోగిస్తారు. ఒక టన్ను తారుకు రూ.30వేలు అవుతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్ని వినియోగించటం ద్వారా రూ.30వేలు ఖర్చు తగ్తుతుంది. ఈ లెక్కన లక్ష కిలోమీటర్ల రోడ్డుకు ఎన్ని వందల కోట్లు మిగలనుంది.

దేశ వ్యాప్తంగా రోజువారీగా 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిల్లో అరవై శాతానికి పైనే రీసైక్లింగ్ కు వినియోగిస్తారు. మిగిలిన నలభై శాతాన్ని ఈ ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ కారణంగా కాలుష్యం పెరిగే వీలుంది. ప్లాస్టిక్ రోడ్లతో చెక్ పెట్టే వీలుందని చెబుతున్నారు. గుర్ గ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ లో దేశంలోనే తొలిసారి ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డును విజయవంతంగా నిర్మించారు. అప్పటి నుంచి తారు రోడ్డులో ప్లాస్టిక వ్యర్థాలతో రోడ్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంలో కాలుష్యం.. మరోవైపు డబ్బులు పెద్ద ఎత్తున ఆదా కావటం ఖాయమంటున్నారు. సైలెంట్ గా ఉంటూఇంత భారీగా రోడ్లు వేయించిన తీరు చూస్తే.. మోడీ సర్కారు తాను చేయాల్సిన పనుల్ని చేసుకుంటూ పోతుందన్న భావన కలుగక మానదు.