సీబీఐ చార్జి షీటులో కీలకపాయింట్ మిస్సయిందా?

Thu Oct 28 2021 14:23:31 GMT+0530 (IST)

Missed a key point in the CBI chargesheet

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కు దారి తీసిన కారణాలు ఏమిటి ? హంతకుల కు వివేకా ను హత్య చేసేంత సీన్ ఉందా ? అసలు అంత అవసరం ఏమొచ్చింది ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరక లేదు. ఇంత కీ విషయం ఏమిటంటే వివేకా హత్య కు సంబంధించి తాజాగా సీబీఐ చార్జి షీటు వేసింది. ఇందు లో ఎర్రగంగిరెడ్డి సునీల్ ఉమ దస్త గిరిని నిందితులు గా చెప్పింది. దర్యాప్తు ఇంకా జరుగుతోందని ఇపుడు దాఖలు చేసిన చార్జి షీటు ప్రాధమిక దర్యాప్తు ఆధారం గా వేసినట్లు మాత్రమే చెప్పింది.మంచి దే ఇప్పటి కైనా వివేకా హత్య కేసు లో సీబీఐ నలుగురు నిందితుల ను గుర్తించింది. ఎర్ర గంగి రెడ్డి దస్త గిరి బెయిల్ పై బయటుండ గా మిగిలిన ఇద్దరు రిమాండ్ లో ఉన్నట్లు చార్జి షీటులో సీబీఐ స్పష్టం చేసింది. హత్య కేసులో నిందితులెవరో చెప్పిన సీబీఐ అసలు హత్య కు కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం చార్జి షీటు లో ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. నిజానికి నిందితులు గా సీబీఐ పేర్కొన్న నలుగురి లో ఎవరికి కూడా వివేకా ను చంపాల్సినంత అవసరం లేదు. అలాగే వివేకా ను హత్య చేసేంత సీన్ కూడా లేదని ప్రచారం జరుగుతోంది.

నిందితులు నలుగురు కూడా ఏదో రూపం లో వివేకా కు బాగా సన్నిహిత సంబంధాలున్నవారే. దస్త గిరి చాలా కాలం వివేకా కారు డ్రైవరు గా పనిచేశారు. ఎర్ర గంగి రెడ్డి కి వివేకా తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే మిగిలిన ఇద్దరు కూడా హతుని తో దగ్గర సంబంధాలున్న వారే. మరి ఇంత సన్నిహితులే వివేకా ను ఎందుకు హత్య చేశారు ? అనే విషయం పై జనాల్లో బాగా చర్చ జరుగుతోంది.

నిందితులు నలుగురే వివేకా ను హత్య చేసారంటే అందుకు బలమైన నేపధ్యమే ఉండి తీరాలి. మరదే నిజమైతే ఆ నేపధ్యం ఏమిటి ? అనేదే జనాల కు అర్ధం కావటంలేదు. ఈ విషయాన్ని సీబీఐ కూడా తన చార్జి షీటులో ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఇంత టి కీలకమైన విషయాన్ని సీబీఐ చార్జి షీటులో ఎందుకని ప్రస్తావించలేదు ? లేక పోతే ప్రస్తావించకపోవటానికి మరేదైనా కారణం ఉందా ? అన్నదే అర్ధం కావటంలేదు.

వివేకా లైఫ్ స్టైల్ తెలిసిన వారెవరు కూడా మాజీ మంత్రి కి శతృవు లున్నారంటే నమ్మ లేక పోతున్నారు. పైగా దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ సోదరుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అని తెలిసిన వాళ్ళెవరు వివేకా జోలికి వెళ్ళాలని కూడా అనుకోరు. అలాంటి అత్యంత సన్నిహితులే వివేకా ను హత్య చేశారంటే ఎవరు నమ్మ లేకపోతున్నారు. సీబీఐ చార్జి షీటు లో నలుగురి పేర్ల ను చెప్పింది కాబట్టి నమ్మక తప్పటం లేదు. కానీ హత్య కు దారి తీసిన కారణాలు ఏమిటి అనేది మాత్రం సీబీఐ బయట పెట్టలేదు. మరి తర్వాత దాఖలు చేసే చార్జి షీటు లో కారణాలను సీబీఐ చెబుతుందేమో చూడాలి.