Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టులో నటుడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించారట

By:  Tupaki Desk   |   29 May 2023 10:15 AM GMT
ఎయిర్ పోర్టులో నటుడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించారట
X
భార్యను రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్ పోర్టుకు వెళ్లిన ఒక ప్రముఖ బెంగాలీ నటుడికి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా సదరు నటుడి ఆరోపణ సంచలనంగా మారింది.

కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి అతడు ఫేస్ బుక్ లైవ్ లో సుదీర్ఘంగా వివరించాడు ప్రముఖ బెంగాలీ నటుడు మైనాక్ బెనర్జీ.

అతడి ఆరోపణ చూస్తే.. తన భార్య ఐశ్వర్య చెన్నై నుంచి కోల్ కతా ఎయిర్ పోర్టుకు వచ్చిందని.. ఆమె కోసం తన కారును ఎయిర్ పోర్టు గేటు వద్దకు వెళ్లగా.. తన వాహనాన్ని అక్కడి నుంచి తీసివేయాలని పోలీసు తనకు చెప్పారని.. అయితే.. అప్పటికే అక్కడ చాలా కార్లు ఉన్నట్లు చెప్పారు. మరెవరితోనూ పోలీసులు చెప్పలేదు కానీ.. నా కారును మాత్రం తీయాలని చెప్పారు. ఈ సందర్భంగా నా భార్యతో అసభ్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన మరో వాదన వినిపిస్తోంది. తన భార్యను రిసీవ్ చేసుకోవటానికి వెళ్లిన మైనాక్, ఎయిర్ పోర్టు గేటు వద్ద తన కారును ఆపాడు. అయితే.. ఎక్కువ లగేజ్ ఉన్న అతడి భార్య కారు వద్దకు వచ్చేసరికి ఆలస్యమైంది.

దీంతో.. అక్కడున్న భద్రతా సిబ్బంది కారును త్వరగా తీయాలని చెప్పటంతో.. ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు. అందరి కార్లు అక్కడ ఉన్నాయి కాబట్టి తన కారును అక్కడ ఉంచటం తప్పేమీ కాదన్నట్లుగా వాదనలు వినిపిస్తున్న మైనాక్ మిస్ అయిన పాయింట్ ఏమంటే.. ఎవరో తప్పు చేశారని.. తను అదే తప్పును ఎందుకు చేయాలి? మరి.. తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బంది మీద ఫిర్యాదు చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.