ఏపీలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్

Sun Dec 08 2019 15:35:18 GMT+0530 (IST)

Minor Girl Gangraped In Mullapudi Offering Lift

దిశ హంతకులను హైదరాబాద్ లో చంపేసినా మృగాళ్ల ఆకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఏపీలోనూ మరో అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.తిరుపతి సమీపంలోని ముళ్లపూడిలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి బాలికపైఈ దారుణానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగుచూసింది.

పద్మావతిపురం దగ్గర తిరుచానూర్ వైపు వెళ్తున్న బైక్ ను లిఫ్ట్ కావాలని అడిగింది బాలిక. తనను తిరుచానూరులో విడిచిపెట్టాలని కోరింది. దీంతో ఆ బైక్ నడుపుతున్న యువకుడు సరేనన్నాడు. తిరుచానూర్ లో బైక్ ను ఆపకుండా ముళ్లపూడి వరకూ తీసుకెళ్లాడు. బైక్ లో పెట్రోల్ అయిపోయిందని నమ్మించి పక్కకు ఆపాడు. తన మిత్రుడికి ఫోన్ చేసి రప్పించుకున్నాడు. స్నేహితుడు రాగానే  ఇద్దరు కలిసి బాలికను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు.

బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరికి గతంలోనూ కేసులు ఉండడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.