Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితుల్ని గుర్తించిన బాలిక‌

By:  Tupaki Desk   |   26 Jun 2022 5:30 AM GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితుల్ని గుర్తించిన బాలిక‌
X
హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇటీవ‌ల రొమేనియా బాలిక‌పై జ‌రిగిన‌ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు నిందితుల్ని గుర్తించే ప్రక్రియను జూన్ 25న‌ పూర్తి చేశారు. ఈ కేసులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన మరో నిందితుడు కూడా ఉన్నాడ‌ని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు మైనర్లను గుర్తించేందుకు బాలిక‌ను జువైనల్‌ హోంకు తీసుకెళ్లారు. చంచల్‌ గూడ జైల్లో ఉన్న సామూహిక అత్యాచార నిందితుడు సాదుద్దిన్‌ మాలిక్‌ను గుర్తించే ప్రక్రియను మేజిస్ట్రేట్‌ సమక్షంలో నిర్వహించారు. కాగా ఆరుగురు నిందితులను బాలిక గుర్తించినట్లు స‌మాచారం. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులతోపాటు, అసభ్యంగా పాల్పడిన మరో మైనర్‌ను కూడా ఆమె గుర్తు ప‌ట్టింద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు మేజిస్ట్రేట్‌కు ఈ వివ‌రాల‌ను తెలిపినట్టు స‌మాచారం.

కాగా ఇప్ప‌టికే పోలీసులు నిందితుల‌ను త‌మ క‌స్ట‌డీకి తీసుకుని వారిని గ్యాంగ్ రేప్ జ‌రిగిన‌ ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్క‌డ‌ సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. ఈకేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారిన సంగ‌తి తెలిసిందే. బాలిక శరీరంపై 12 చోట్ల‌ గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది. బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు ఉన్నాయి. మైనర్ బాలిక‌ మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

మ‌రోవైపు ఈకేసులో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజీలో ఎరుపు రంగు బెంజి కారులో మైనర్ బాలిక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి ప్రయాణిస్తన్న ఆధారాలు దొరికాయి. అమ్నేషియా పబ్‌లో బాలికను పరిచయం చేసుకునప్పటి నుండి ఆమెను ట్రాప్‌లోకి దించడం.. అనంతరం అత్యాచార ఘటన.. మరుసటి రెండు రోజుల వరకు అసలు ఏం జరిగింది.. ఎక్కడికి పరార్ అయ్యారు, ఎవరి సహాయంతో తెలంగాణ స్టేట్ దాటారు.. ఇలా అనేక కోణాల్లో విచారించారు. ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో పొటెన్సీ పరీక్షలు (లైంగిక పటుత్వ పరీక్షలు) కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.