బాలయ్యపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Fri Jan 22 2021 11:53:02 GMT+0530 (IST)

Minister Kodali Nani interesting Comments on Balayya

ప్రముఖ టాలీవుడ్ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణపై ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని తాజాగా బాలయ్య ఇటీవల జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ... ‘బాలక్రిష్ణ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బాలయ్య ఎన్టీఆర్ కుమారుడు.. రామారావు ఆకాశమంత ఎత్తులో ఉంటారని.. ఆయన కుమారుడిగా పుట్టి చంద్రబాబు తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే ఆయన వెనుకే తిరుగుతున్నా వ్యక్తి బాలయ్య’ అంటూ సెటైర్లు వేశారు.

ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్ కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ పదవిని లాక్కుంటే నేనేంటో చూపించేవాడిని’ అంటూ మంత్రి కొడాలి నాని పరోక్షంగా బాలయ్య పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి బయటకు గెంటేసినా ఇంకా బాబు వెంటే తిరుగుతుంటే బాలయ్యకు ఉన్న ఆలోచన ఏంటి? ఆయన శక్తి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

బాలయ్య ఆటలో అరటిపండు అని.. ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బాలయ్య ఇవ్వాలా? అన్న ప్రశ్నకు ‘ఒకవేళ అడిగితే ఇచ్చేయొచ్చు’ అని నాని బదులిచ్చాడు. ప్రెసిడెంట్ పదవే తీసుకోవచ్చని.. ఆయన తండ్రి పార్టీని ఆయన అడగడంలో తప్పులేదని అన్నారు.