Begin typing your search above and press return to search.

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించేది హైదరాబాదే : కేటీఆర్

By:  Tupaki Desk   |   4 Aug 2020 5:33 PM GMT
ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించేది హైదరాబాదే : కేటీఆర్
X
ప్రపంచాన్ని భయంతో గజగజ వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే వస్తుందని, అది కూడా భారత్ బయోటెక్ నుంచే వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేసారు. హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను ఈరోజు మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీకాల అభివృద్ధి, తయారీలో భారతదేశ భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని ప్రపంచ దేశాలు పదేపదే చెపుతున్నాయని... ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు.

సీఎండీ డాక్ట‌ర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్ట‌ర్ శ‌క్తి నాగ‌ప్ప‌న్‌ తో క‌లిసి మంత్రి చ‌ర్చ‌ను నిర్వ‌హించారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌ బ‌యోటెక్ ముందంజంలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ దేశాలకు మూడో వంతు వ్యాక్సిన్ ను హైదరాబాద్ నుంచి అందిస్తున్నామని... ఇది మనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు. ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్‌ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదని కృష్ణ ఎల్లా. వాటర్‌ బాటిల్‌ ధర కంటే తక్కువ ధరలోనే కరోనా వాక్సీన్‌ను తీసుకొస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు. ఇదే మీటింగ్ లో మంత్రి కేటీఆర్ తో పాటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కూడా పాల్గొన్నారు. కొవాగ్జిన్ భారత వైద్య పరిశోధనా మండలి , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది.