మంత్రి ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం..

Mon Jul 26 2021 21:25:51 GMT+0530 (IST)

war of words between the minister and the MLA

టీఆర్ఎస్ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరూ కొట్టుకోవడమే తక్కువ అన్నట్టుగా పరస్పరం దూషణలు చేసుకున్నారు. మైక్ లాక్కొని రభస చేశారు.



భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం రచ్చరచ్చ అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడిచింది. కార్యక్రమం నుంచి రాజగోపాల్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు.

స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీశ్ రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని రాజగోపాల్ అన్నారు. దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి చిల్లర వ్యక్తి అని ఘాటుగా మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఏ పూటకు ఏ పార్టీలో ఉంటారో తెలియదని జగదీష్ ఎద్దేవా చేశారు. పొద్దున్నో మాట సాయంత్రం మరో మాట మాట్లాడే చిల్లర మనిషి రాజగోపాల్ రెడ్డి అని విమర్శించారు.  మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతానని.. ఎలా ఆపుతావో చూస్తానంటూ రాజ్ గోపాల్ కు జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.

ఈ క్రమంలోనే మంత్రి ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట చోటుచేసుకుంది. 60 ఏళ్లలో ఏమీ చేయలేని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.