Begin typing your search above and press return to search.

దుబ్బాకలో హరీశ్ సీక్రెట్ టాస్కు అదేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2020 7:10 AM GMT
దుబ్బాకలో హరీశ్  సీక్రెట్ టాస్కు అదేనా?
X
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక మీద అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. త్రిముఖ పోటీ సాగుతున్న ఈ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంటే.. కాంగ్రెస్.. బీజేపీలు మాత్రం తాజా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకోసం వారు పెద్ద ఎత్తున పని చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నది విపక్షాల ఆలోచన.

దుబ్బాకలో తమదే అధిక్యమన్న నమ్మకంతో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ ఎన్నిక బాధ్యతను ప్రత్యేకంగా తీసుకున్న మంత్రి హరీశ్.. రాత్రి..పగలు అన్న తేడా లేకుండా పని చేస్తున్నారు. భారీ మెజార్టీతో పార్టీ అభ్యర్థిని గెలిపించటం ద్వారా.. జిల్లాలో తనకున్న పట్టు ఎంతన్నది చూపించాలని తపిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో విపరీతంగా శ్రమిస్తున్న ఆయన.. గెలుపు కోసం మరో సీక్రెట్ టాస్కును చేపట్టినట్లుగా తెలుస్తోంది.

రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవాలని హరీశ్ అనుకోవటం లేదు. అందుకే.. క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఆయన కొత్త వ్యూహాన్నిసిద్ధం చేసుకున్నారు. తన సీక్రెట్ టాస్కులో భాగంగా తనకు అత్యంత నమ్మకస్తులైన 20 మంది చాకుల్లాంటి కుర్రాళ్లను నాలుగు టీంలుగా చేసినట్లు తెలుస్తోంది.

ఈ టీంలు దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తుంది. రోజుకు ప్రతి మండలంలోని నాలుగైదు గ్రామాల్లో సీక్రెట్ గా పర్యటిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏమేం జరుగుతుందన్న విషయాల్ని పరిశీలిస్తారు.రాత్రి అయ్యేసరికి తాము సేకరించిన సమాచారాన్ని హరీశ్ కు పంపుతారు. ఉదయం లేచిన వెంటనే.. రాత్రి వచ్చిన నివేదిక ఆధారంగా పనుల్నిపూర్తి చేయటం.. గుర్రుగా ఉన్న వారిని సెట్ చేయటం లాంటివి చేసేస్తున్నారు.

ఈ సీక్రెట్ మిషన్ లోని సభ్యులు సాదాసీదాగా గ్రామాల్లో తిరుగుతూ.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని గమనించటం.. స్థానికులతో మాట్లాడటం ద్వారా స్థానిక అంశాల్ని సేకరించటం లాంటివిచేస్తున్నారు.గతంలో ఎప్పుడూ ఏ ఎన్నికల వేళలోనూ చేపట్టిన ఈ ప్రైవేటు సిబ్బందితో చేస్తున్న సీక్రెట్ టాస్కు.. దుబ్బాక ఎన్నికల ఫలితంలో చక్కటి ఫలితాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.