Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఫైల్స్ : శ‌త్రువుతో క‌లిసి హ‌రీశ్ రావు న‌వ్వులు ? ఎక్క‌డంటే !

By:  Tupaki Desk   |   12 May 2022 11:30 PM GMT
టీఆర్ఎస్ ఫైల్స్ :  శ‌త్రువుతో క‌లిసి హ‌రీశ్ రావు న‌వ్వులు ? ఎక్క‌డంటే !
X
ఎప్పుడూ మాట‌ల యుద్ధం చేసుకునే ఇద్ద‌రు నేత‌లు క‌లిశారు. న‌వ్వులు పువ్వులు పూశాయి. వారే హరీశ్ రావు, రాజా సింగ్. ఈ అరుదైన దృశ్యానికి ఉస్మానియా ఆస్ప‌త్రి వేదికైంది. ఆస్ప‌త్రికి వ‌చ్చే పేద‌ల‌తో పాటు వారికి స‌హాయంగా ఉండే బంధువుల‌కు ప‌ట్టెడ‌న్నెం పెట్టాల‌న్న ఆలోచ‌న‌తో సీఎం కేసీఆర్ ఓ వినూత్న ప‌థ‌కానికి శ్రీ‌కారం దిద్దారు.ఈ ప‌థ‌కంలో భాగంగా ఆస్ప‌త్రికి వ‌చ్చే పేద రోగుల స‌హాయ‌కుల‌కు కూడా మూడు పూట‌లా భోజ‌నం అందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్ప‌త్రుల ఎంపిక కూడా పూర్తైంది. హైద్రాబాద్ లో 18 ఆస్ప‌త్రుల‌కు ఈ సౌక‌ర్యం అందించ‌నున్నారు. ఈ మేరకు ఈ రోజు ఈ క్ర‌తువుకు శ్రీ‌కారం దిద్దారు. కేసీఆర్ నిర్ణయం పై స‌ర్వ‌త్రా ఆనందం వ్య‌క్తం అవుతోంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఎప్పుడూ త‌గాదాలు ప‌డే టీఆర్ఎస్ లీడ‌ర్ హ‌రీశ్ రావు. ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (బీజేపీ)ప‌ర‌స్ప‌రం న‌వ్వులు పువ్వులు పూయించారు. త‌గాదాలు వాగ్వాదాలు ల‌డాయి మాట‌లు ఎలా ఉన్నా కూడా ఈ సారి మాత్రం ప్రొటొకాల్ ప్ర‌కారం ఉస్మానియా ప్రాంగ‌ణాన ఉచిత భోజ‌న ప‌థ‌కం ప్రారంభోత్స‌వాన్ని రాజాసింగ్ తోనే చేయించారు. అంతేకాకుండా ఆయ‌న యోగ క్షేమాలు తెలుసుకుని చాలా సేపు ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఇదే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌కు తావిస్తోంది. ఓ విధంగా హ‌రీశన్న మంచి ప‌ని చేసి విప‌క్షాల మ‌ద్ద‌తు కూడా పొందార‌ని కేసీఆర్ వ‌ర్గాలు కూడా ప్ర‌శంసిస్తున్నాయి.

బీజేపీ కూడా ఎప్పుడూ విమ‌ర్శ‌లే కాదు సుహృద్భావ వాతావ‌ర‌ణంలో నాయ‌కులు క‌లిసి ప‌నిచేస్తే స‌ర్కారు ఆస్ప‌త్రుల ప‌నితీరు మెరుగు ప‌డ‌డ‌మే కాదు, ఇక్క‌డ అమ‌ల‌వుతున్న వివిధ ప‌థ‌కాల తీరు తెన్నులూ మారుతాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ స‌ర్కారు ఖ‌జానాకు న‌ల‌భై కోట్ల‌కు పైగా నెల‌కు భారం అయిన‌ప్ప‌టికీ ఉస్మానియా తో సహా ఎంపిక చేసిన ద‌వాఖానాల్లో పేద‌ల రోగుల‌కూ వారి స‌హాయకుల‌కూ ఆహారం అందించండం మంచిదే ! ఇదే సంంద‌ర్భంలో ఆస్ప‌త్రుల్లో నాణ్య‌మైన ఆహారం అందించేందుకు తెలంగాణ మాత్ర‌మే కాదు ఏపీ స‌ర్కారు కూడా దృష్టి సారించాల‌ని అంటున్నారు ఇంకొంద‌రు.