మిని మున్సిపల్ పోరు : టీఆర్ఎస్ ప్రభంజనం ..కొనసాగుతోన్న హవా !

Mon May 03 2021 14:00:01 GMT+0530 (IST)

Mini Municipal Fighters Breaking Up..Continuing

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. కాగా రాష్ట్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం మున్సిపల్ కార్పోషన్ తోపాటు సిద్దిపేట నకిరేకల్ అచ్చంపేట్ జడ్చర్ల కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు నిర్వహించగా గజ్వేల్ నల్లగొండబోధన్ పరకాలతో మున్సిపాలిటీల్లో ఓక్కోవార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఇక వరంగల్ కార్పోషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ..కొత్తూరు మున్సిపాలిటికి అతి తక్కువగా 23 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడింది. నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 12 వార్డులను టీఆర్ ఎస్ కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 కాంగ్రెస్ 1 స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.

ఇక జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

ఇక టీఆర్ ఎస్  పార్టీ కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది.  సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. గులాబీ జెండా ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 43 వార్డులకు గానూ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ పన్నెండు వార్డుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్ 23 డివిజన్లలో బీజేపీ 3 డివిజన్లలో కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది.