Begin typing your search above and press return to search.

ఉలిక్కిపాటు: ఒంగోలుతో పాటు దేశ‌వ్యాప్తంగా భూప్ర‌కంప‌న‌లు

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:00 AM GMT
ఉలిక్కిపాటు: ఒంగోలుతో పాటు దేశ‌వ్యాప్తంగా భూప్ర‌కంప‌న‌లు
X
భూ ప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌లు రేపుతున్నాయి. గ‌త నెల‌లో ఉత్త‌ర భార‌త‌దేశంలో భూప్ర‌కంప‌నాలు క‌ల‌వ‌రం సృష్టించ‌గా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తో పాటు క‌ర్నాట‌క - ఝార్ఖండ్‌ లో కూడా భూప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. తెల్ల‌తెల్ల‌వారుతుండ‌గానే భూమి క‌ద‌ల‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న చెంది వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

ఒంగోలులో ఉద‌యం 6.55 గంట‌ల స‌మ‌యంలో భూప్రకంప‌న‌లు వ‌చ్చాయి. ఊహించ‌ని రీతిలో భూమిలో క‌ద‌లిక‌లు ఏర్ప‌డ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న చెంది వెంట‌నే ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఒంగోలులోని శర్మ కళాశాల - అంబేడ్క‌ర్‌ భవన్ - సుందరయ్య భవన్ రోడ్డు త‌దిత‌ర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వ‌చ్చాయి. అయితే కొద్దిసేప‌టి వ‌ర‌కు మాత్ర‌మే భూమిలో క‌ద‌లిక‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఇళ్ల బ‌య‌ట‌నే ఉన్నారు. దీనిపై అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్నారు. దీనిపై శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేస్తున్నారు.

ఇక క‌ర్నాట‌క‌లోని హంపి - ఝార్ఖండ్‌ లోని జంషెడ్‌ పూర్‌ లో కూడా భూమి కంపించింది. హంపిల్ రిక్టర్ స్కేల్‌ పై 4గా నమోదు కాగా - జంషెడ్‌ పూర్‌ లో 4.7గా భూ ప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి. అయితే స్వ‌ల్పంగా భూప్ర‌కంప‌న‌లు రావ‌డంతో ఎలాంటి న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఆస్తి - ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో స్థానికుల‌తో పాటు ప్ర‌భుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక‌స్మాత్తుగా భూ ప్ర‌కంప‌నాలు రావ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. గ‌తంలో ఉత్త‌ర భార‌త‌దేశం లో ఇలాంటి సంఘ‌ట‌న‌లే చోటుచేసుకున్నాయి.