చివరిసారిగా ట్రంప్ తో కలిసి ఫోటోలు దిగేందుకు ఇష్టపడని మెలానియా

Sat Jan 23 2021 23:00:01 GMT+0530 (IST)

Melania did not want to take photos with Trump for the last time

ఓపక్క అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారం సాగుతున్న వేళ.. సంప్రదాయం ప్రకారం దానికి ట్రంప్ హాజరు కావాలి. కానీ.. అందుకు భిన్నంగా ఆయన వైట్ హౌస్ నుంచి వాష్టింగన్ డీసీ నుంచి ఫ్లోరిడా వెళ్లిపోయారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోకి ట్రంప్ విమానం ల్యాండ్ అయ్యాక.. ఆయన కోసం మీడియా ఎదురుచూస్తోంది. అధ్యక్ష పదవి నుంచి అప్పుడే దిగిన ఆయన.. మాజీ హోదాలో విమానం దిగారు.ఈ క్రమంలో విమానంలో దిగిన ట్రంప్ దంపతులు.. నడుచుకుంటూ మీడియా వారి ముందుకు వచ్చినప్పుడు సెకన్ ఆగారు. ట్రంప్ ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు అక్కడే నిలిస్తే.. మెలానియా మాత్రం ట్రంప్ తో కలిసి ఫోటోలు దిగేందుకు ఇష్టపడనట్లుగా కనిపించారు. తన దారిన తాను కారు వైపునకు వెళ్లిపోయారు. ట్రంప్ దంపతుల మధ్య సత్ సంబంధాలు లేవని.. త్వరలో వారు విడిపోతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళలో చోటు చేసుకున్న తరుణంలో తాజా పరిణామం.. విడాకుల చర్చకు మరింత బలంగా మారింది.

పద్నాలుగు నిమిషాలు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారిద్దరి తీరు చూస్తే.. త్వరలోనే వారిద్దరి విడాకులు ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోను చూస్తున్న వారు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ట్రంప్ ను మీడియాకు మెలానియా వదిలేశారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మధ్యన జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు కావటానికి వెళుతున్న మెలానియా.. ట్రంప్ చేతిని కాకుండా ఒక సైనికుడి చేతిని పట్టుకొని నడిచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఉదంతం వైరల్ గా మారింది. తాజాగా జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపికైంది.