గీతగారి దూకుడు గీత గీసేవారే లేరా?

Wed Nov 25 2020 23:30:32 GMT+0530 (IST)

Meesala Geetha goes to high level in TDP

అదేంటో.. టీడీపీలో ఏ చిన్న లుకలుక వినిపించినా... అధిష్టానం ఉలిక్కిపడుతోంది. నాయకులు ఎక్కడ పార్టీ మారిపోతారోనని భయపడుతోంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనే.. విజయనగరం కేంద్రంగా సాగుతోం ది. ఇక్కడ టీడీపీకి కంచుకోటలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కనుసన్నల్లో ఇక్కడ టీడీపీ దూకుడుగా ముందుకు సాగింది. అయితే.. ఆయన ఆధిపత్య రాజకీయాలకు భిన్నంగా కొందరు నేతలను ఇక్కడ చంద్రబాబు ప్రోత్సహించారు. ఏమో.. ఎప్పుడు ఏమవుతుందోనని అనుకున్నారు. ఈ క్రమంలోనే మీసాల గీతకు ఎక్కువ ఛాన్స్‌లే ఇచ్చారు.2014 ఎన్నికల్లో మీసాల గీత రెండు ఓటముల తర్వాత విజయం దక్కించుకున్నారు. తనకంటూ.. ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. అశోక్ కు భిన్నంగాటీడీపీని బలోపేతం చేసుకున్నారు. ఈ విషయంలో అశోక్ అభ్యంతరం చెప్పినా.. చంద్రబాబు చూసీ చూడనట్టు వ్యవహరించారు. ఇదిలావుంటే.. గత ఏడాది ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకుండా అశోక్ కుమార్తె అదితికి ఇచ్చారు చంద్రబాబు ఇదే పెను వివాదానికి కారణం అయింది. పైకి తనను పొగుడుతూ.. పార్టీకి వాడుకుంటూ.. తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని గీత భీష్మించారు. అప్పట్లో సర్ది చెప్పిన చంద్రబాబు ఏకంగా తెలుగు మహిళ అధ్యక్ష పీఠాన్ని ఆశచూపించారు.

అయితే మారిన సమీకరణలు... పార్టీ ఓటమిపాలవడం వంటి కారణంతో గీతను పట్టించుకోవడం తగ్గించా రు. ఇస్తానన్న తెలుగు మహిళ పదవి సహా.. పార్టీలో ఏ ఒక్క స్థానంలోనూ ఆమెకు పదవి ఇవ్వలేదు. పైగా.. అశోక్ కుమార్తె అదితికి పగ్గాలు అప్పగించారు. దీంతో గీత తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనకు దక్కని మర్యాద మరొకరి ఎలా లభిస్తుందని పేర్కొంటూ.. సొంతగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. తనకున్నపలుకుబడితో.. అశోక్ కార్యాలయాన్ని ఎత్తేయించారు. దీంతో ఈ ఘటన మరిన్ని వివాదాలకు కేంద్రంగా మారి.. ఏకంగా గీత ఇప్పుడు వైసీపీ గూటికి చేరువయ్యారు. త్వరలోనే వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు.. వెంటనే ఆమెను బుజ్జగించాలని అచ్చెన్నకు బాధ్యతలు అప్పగించారట. కానీ ఆమె స్పందించడం లేదు. మరి ఈ విషయం ఎటు దారితీస్తుందోననిపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చూడాలి గీత దూకుడు గీత గీస్తారో.. వదిలేస్తారో!!