జకీర్ కోసం ఓవైసీ ఎత్తు గమనించారా?

Tue Jul 12 2016 19:46:36 GMT+0530 (IST)

Media trial of Dr Zakir Naik should end Says AIMIM MLA Imtiaz Jaleel

ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఎఐఎమ్ ఐఎమ్) పొట్టిగా ఎంఐఎం.  హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ పార్టీకి అధినేతగా ఉన్న సంగతి తెలిసిందే. హిందు దేవతల గురించి తీవ్ర విమర్శలు చేసే ఎంఐఎం నాయకులకు ఇటీవల స్వరం మార్చారు. అంతర్జాతీయ రాక్షసమూక ఐసిస్ కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు. కానీ వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకిర్ నాయక్ విషయంలో మళ్లీ ఎంఐఎం మార్క్ ప్రకటన విడుదల చేశారు.ఎఐఎమ్ ఐఎమ్ తరఫున మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో జకీర్ ను పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. జకీర్ విషయంలో భారతదేశ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ భారత చట్టాలను గౌరవిస్తుందని  కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎవరినీ  కూడా దోషులుగా పరిగణించడానికి వీలులేదని పేర్కొన్నారు. అందుకే జకీర్ నాయక్ పై మీడియా దర్యాప్తు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇకనైనా మీడియా దూకుడు తగ్గించుకుంటే మంచిదని కూడా సూచించారు.

అయితే ఎంఐఎంకు చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేయడం వెనుక వేరే లాజిక్ ఉందంటున్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని ఖండించేలా ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ పలు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జకీర్ ఐసిస్ వైపు ఓ వర్గం యువత వెళ్లేలా ప్రసంగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవైసీ నేరుగా ఆయనపై వ్యాఖ్యలను ఖండించలేని పరిస్థితి. అందుకే వ్యూహాత్మకంగా పొరుగు రాష్ట్రంలోని తమ ఎమ్మెల్యేతో ప్రకటన విడుదల చేయించారని తద్వారా ఓ కీలక వర్గాన్ని సంతృప్తి పరిచారని అంటున్నారు.