Begin typing your search above and press return to search.

ఉద్యోగం కోల్పోయిన లేడీ పోలీస్ ఆఫీసర్ కు బంపరాఫర్ ప్రకటించిన స్ట్రిప్ క్లబ్..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:00 AM GMT
ఉద్యోగం కోల్పోయిన లేడీ పోలీస్ ఆఫీసర్ కు బంపరాఫర్ ప్రకటించిన స్ట్రిప్ క్లబ్..!
X
మేఘన్ హాల్ అనే లేడీ పోలీసాఫీసర్ పేరు ఈ నెల ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. పెళ్లియినప్పటికీ ఆమె తన కామవాంఛ తీర్చుకునేందుకు ఏకంగా ఆరుగురు తోటి అధికారులతో ఎఫైర్ నడిపింది. వీలున్నప్పుడల్లా నైట్ పార్టీలతో సందడి చేసింది. ఆమె ఫోన్ మొత్తం బూతు మెసేజ్ లతో నిండిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఎఫైర్ బయటపడటంతో పోలీస్ డిపార్ట్మెంట్ మేఘన్ హాల్ ను సస్పెండ్ చేసింది.

ఆమెతో ఎఫైర్ నడిపిన అధికారులను సైతం సస్పండ్ చేసి విచారణ చేపట్టింది. ఇందులో మేఘన్ హాల్ తోటి అధికారులతో ఎఫైర్ నడిపినట్లు తేలింది. దీంతో వీరిందరిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు పోలీస్ చీఫ్ బర్రెల్ డేవిస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వ్యక్తులు చేసే చర్యలకు బాధ్యత వహించదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనతో మేఘన్ హాల్ అప్రతిష్టపాలు కావడంతోపాటు ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నాష్ విల్లేలోని డేజావు అనే స్ట్రిప్ క్లబ్ ఆమెకు బంపరాఫర్ ఇచ్చింది. తమ క్లబ్ తరుఫున షోలో పాల్గొని ఫార్మమ్ చేస్తే 10వేల డాలర్లు ఇస్తామని ప్రకటించింది.

ఆ క్లబ్ లో పనిచేస్తున్న షో గర్ల్స్ ఇదే విషయంపై మాట్లాడుతూ ఇది ఆమెకు మంచి ఆఫర్ అని పేర్కొన్నారు. రీజనల్ డైరెక్టర్ మైకేల్ దుర్హమ్ మాట్లాడుతూ మార్చి 17న తమ క్లబ్ రెండు షోలను నిర్వహిస్తుందని తెలిపారు. మేఘన్ హాల్ కు ప్రస్తుతం పోలీస్ ఉద్యోగం లేనందు వల్ల ఆమె అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఒక్కో షోకి 5వేల డాలర్ల చొప్పున రెండు షోలకు గాను 10వేల డాలర్లు ఇస్తామని చెప్పారు.

ఈ డబ్బులు ఆమెను ఆర్థిక సమస్యల నుంచి బయట పడేయొచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆమె పోలీస్ ఉద్యోగం లేనందు వల్ల తన అవసరాల దృష్ట్యా కెరీర్ పరంగా ఆమె ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని స్ట్రిప్ క్లబ్ రీజనల్ డైరెక్టర్ మైకేల్ దుర్హమ్ తెలిపారు. కాగా మేఘన్ హాల్ తన తోటి అధికారులతో ఎఫైర్ నడిచినప్పటికీ ఆమె భర్త మాత్రం విడాకులు ఇవ్వకుండా కలిసే జీవిస్తుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.