Begin typing your search above and press return to search.

5జీ కంటే మాతాజీ, పితాజీనే గొప్ప అన్న ముఖేష్ అంబానీ

By:  Tupaki Desk   |   3 Dec 2022 4:32 PM GMT
5జీ కంటే మాతాజీ, పితాజీనే గొప్ప అన్న ముఖేష్ అంబానీ
X
దేశంలోనే నంబర్ 1 కుబేరుడిగా మొన్నటి వరకూ ఉన్నాడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం అదానీ రావడంతో రెండోస్థానానికి దిగజారాడు. అయినా కూడా ముఖేష్ కొన్ని సంవత్సరాలు దేశంలో అపర కుబేరుడిగా ఉన్నాడు. దేశానికి జియో టెలిఫోన్ నెట్ వర్క్ తో అందరికీ ఇంటర్నెట్ ను చేరువ చేసిన గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ముఖేష్ వ్యాపార దక్షతపై ఇప్పటికీ ప్రశంసలు కురుస్తుంటాయి. 4జీ ప్రవేశపెట్టిన ముఖేష్ ఇప్పుడు 5జీ అమలు చేస్తున్నారు. శాస్త్రసాంకేతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ముఖేష్ తాజాగా విద్యార్థులకు మాత్రం ఈ 5జీ కంటే తల్లిదండ్రులే గొప్ప అని కీర్తించడం విశేషం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విద్యార్థులు తమ జీవితంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యతను అభినందించడానికి.. అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.

పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ముఖేష్ ప్రసంగిస్తూ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు హితబోధ చేశారు. తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వాలని.. వారికి మద్దతుగా నిలవాలని సూచించారు.

" యువత భాషలో నేను మీకు ఒక విషయం చెబుతాను. ఈ రోజుల్లో ప్రతి యువకుడు 4G.. ఇప్పుడు 5G గురించి ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో మాతా జీ మరియు పితా జీ కంటే గొప్ప 'G' లేదు. వారు ఎల్లప్పుడూ మీ బలం.. మద్దతు యొక్క అత్యంత ఆధారపడదగిన మూల స్తంభాలుగా ఉంటారు" అని ముఖేష్ వ్యాఖ్యానించాడు.

"ఈ రోజు మీ రోజు మీ రెక్కల్లో నిలబడి ఉన్నారు. దీనివెనుక మీ తల్లిదండ్రులు.. పెద్దల సహకారం మరువలేనిదని గుర్తించండి.. వారికి కూడా ఇది చాలా ప్రత్యేకమైన రోజు. వారు వేదికపైకి వెళ్లి మిమ్మల్ని స్వీకరించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.. ఇది వారి చిరకాల స్వప్నం. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి వారు చేసిన పోరాటాలు.. వారు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరువకండి. మీ విజయానికి వారి సహకారం ఎనలేనిది," అని ముఖేష్ తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరించారు..

2047 నాటికి భారతదేశం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రకాశవంతమైన యువ మనస్సులు సహాయపడతాయని అంబానీ "నమ్మకం"తో చెప్పారు.

వ్యాపార దిగ్గజం రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవలను విజయవంతంగా ప్రారంభించింది.ఈ క్రమంలోనే టెక్నాలజీ కంటే తల్లిదండ్రులే గొప్ప అని కొనియాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.